|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నువ్వు అలిగితే ముద్ద పెట్టేది నేనే.. తనూజాకి ఝలక్‌ ఇచ్చిన సుమన్‌ శెట్టి.. ఆరో వారం నామినేషన్స్ లిస్ట్

Published: 13-10-2025, 10:56 AM
నువ్వు అలిగితే ముద్ద పెట్టేది నేనే.. తనూజాకి ఝలక్‌ ఇచ్చిన సుమన్‌ శెట్టి.. ఆరో వారం నామినేషన్స్ లిస్ట్

బిగ్ బాస్ తెలుగు 9లో ఐదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌ను హీటెక్కించాయి. సుమన్‌ శెట్టి, తనూజ మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్‌గా నిలిచింది. తాజా నామినేషన్స్ ప్రక్రియలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో చూద్దాం.

Key Points

1

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఐదో వారంలో ఆరుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

2

ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియను కొత్త కంటెస్టెంట్లతో చేయించి ఉత్కంఠ పెంచారు.

4

నిఖిల్‌ నాయర్‌, రమ్య మోక్ష, రాము రాథోడ్ తమకు నచ్చిన వారిని నామినేట్ చేశారు.

ఆరో వారం నామినేషన్స్ హీట్

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఐదో వారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ సెన్సేషన్‌ దివ్వెల మాధురీ, సోషల్‌ మీడియా సంచలనం రమ్య మోక్ష, టీవీ నటి ఆయేషా జీనత్‌తోపాటు నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌ గుప్తా, శ్రీనివాసా సాయి ఫైర్ స్టోర్మ్ అంటూ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వీరు రాకతో హౌజ్‌లో వాతావరణం మారిపోయింది. హౌజ్‌ మొత్తం హిటెక్కినట్టుగా ఉంది. దివ్వెల మాధురీ రావడం రావడంతోనే రచ్చ షురూ చేసింది. తనదైన పంచ్‌లు, సెటైర్లతో రెచ్చిపోతుంది. ఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీజకి, ఇప్పుడు కెప్టెన్‌ కళ్యాణ్‌కి ఆమె ఇచ్చిపడేసింది.

ఇక ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ హౌజ్‌ని హీటెక్కించింది. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు, పాత వారి మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. వారితోనే నామినేషన్స్ చేయించి రచ్చ లేపారు.  వీక్‌నెస్‌లను, తప్పులను బయటపెడుతూ నామినేషన్ ప్రక్రియని గరంగరంగా మార్చేశారు. బిగ్‌ బాస్‌ ఇచ్చిన టాస్క్ ప్రకారం వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారు బాల్‌ని సంపాదించి, తమకు నచ్చిన కంటెస్టెంట్లని ఇచ్చే అవకాశం కల్పించారు. వాళ్లు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా మొదట నిఖిల్‌ నాయర్‌ బాల్‌ని సంపాదించి తనూజకి ఇచ్చారు. ఆమె సుమన్‌ని నామినేట్‌ చేసింది. `అందరితో కలిసిపోయి, మీకు మీరు ఇన్‌ వాల్వ్ అయితే బాగుంటుంద`ని తనూజ చెప్పగా, `ఎప్పుడు మీరు అలిగినా, ఏడ్చినా ఫస్ట్ వచ్చి మీకు ముద్దపెట్టేది నేనే` అని సుమన్‌ చెప్పడంతో తనూజకి దిమ్మతిరిగిపోయింది. ఆమె నోట నుంచి మరో మాట రాలేదు.

సుమన్‌ శెట్టి, తనూజ వాగ్వాదం

ఆ తర్వాత రాము రాథోడ్‌ని నామినేషన్‌ చేసింది తనూజ. `సంజనా విషయంలో కూడా నువ్వు అందరిని అడగొచ్చు కదా` అని ఆమె వాదించగా, `మెడికల్‌ ఇష్యూ ఎవరికి మేజర్‌గా ఉందనేది చూస్తారు కదా` అని కౌంటర్‌ ఇచ్చాడు రాము. `అంటే నువ్వు డాక్టర్‌ వా` అంటే,   `నేను కెప్టెన్‌`ని అని రాము వేసిన పంచ్‌ అదిరిపోయింది. `నువ్వు ఒకరికి ఒకలాగా, మరొకరికి మరోలా చేస్తున్నావ`ని ఆమె ఆరోపించింది. దాన్ని రాము  సైలెంట్‌ అయ్యాడు. ఆ తర్వాత రమ్య మోక్ష ఆ బాల్‌ని దక్కించుకుని రాము రాథోడ్‌కి ఇచ్చింది. ఆయన రీతూ, పవన్‌లను నామినేట్‌ చేశాడు. `బిగ్‌ బాస్‌ క్లీయర్‌ కట్‌గా చెప్పాడు, కానీ ఫస్ట్ నేను పౌల్‌గా గమనించింది రీతూ అండ్‌ పవన్‌ లదే` అని రాము చెప్పగా, `బిగ్‌ బాస్‌ చెప్పిన తర్వాత నువ్వు పౌల్‌ గేమ్‌ అనడం కాదు` అని రీతూ అంటే, దానికి రాము వాదించాడు. దీంతో `అరేయ్‌ బాబు ఇది పౌల్‌ గేమ్‌ అన్నప్పుడు వీళ్లు డిస్‌ క్వాలిఫై అని గేమ్‌ని ఆపేయోచ్చుగా` అని వాదించింది రీతూ.

`మీ వల్లే గేమ్‌ రద్దు అయ్యింద`ని రాము రాథోడ్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు. దీనికి రీతూ కూడా రెచ్చిపోయింది. `నువ్వేం చేస్తున్నావ`ని ప్రశ్నించింది. దీనికి పవన్‌ని ఉద్దేశించి రాము చెబుతూ, నేను అనుకోలేదు.. నువ్వు కూడా రీతూతో ఇలా చేస్తావని అనగా, మధ్యలో కల్పించుకున్న రీతూ నువ్వు సంచాలక్‌గా పడుకున్నావని కౌంటర్‌ ఇవ్వడంతో అంతా షాక్‌ అయ్యారు. `నేను ఆయనతో మాట్లాడుతున్నా` అని రాము చెప్పగా, `నేను నీతోనే మాట్లాడతా` అని రీతూ చెప్పడం హౌజ్‌లో వాతావరణం హిటెక్కిపోయింది. తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటోంది. రచ్చ రచ్చగా అనిపిస్తోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీల ప్రభావం

అయితే లీక్‌ అయిన సమాచారం మేరకు ఆరో వారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్‌ అయ్యారు. వారిలో సుమన్‌ శెట్టి, రాము రాథోడ్‌, భరణి, డీమాన్‌ పవన్‌, దివ్య, తనూజ ఉన్నారు. మొత్తంగా బిగ్‌ బాస్‌ తెలుగు 9లో అసలు గేమ్‌ ఇప్పట్నుంచే ప్రారంభమైందని అర్థమవుతుంది. మరి ఇకపై షో వేరే లెవల్‌లో ఉంటుందా? మొదటి నుంచి హోస్ట్ నాగార్జున చెప్పినట్టు రణరంగంగా మారుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో పాత కంటెస్టెంట్లు భరణి, తనూజ, సుమన్‌ శెట్టి, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, దివ్య, సంజనా, కళ్యాణ్‌తోపాటు కొత్తగా వచ్చిన దివ్వెల మాధురీ, రమ్య మోక్ష, ఆయేషా జీనత్‌, నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌ గుప్తా, శ్రీనివాస సాయి ఉన్నారు. మళ్లీ 15 మంది కంటెస్టెంట్లు అయ్యారు.

బిగ్ బాస్ ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ కంటెస్టెంట్లలో ఉత్కంఠను రేపింది. ముఖ్యంగా సుమన్‌, తనూజల మధ్య మాటల యుద్ధం హౌస్‌లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే వారాల్లో మరింత డ్రామా, ఎమోషన్స్ ఉంటాయని అంచనా వేయవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.