|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమ్మర్ హాలిడేస్‌తో ధీరజ్ మొగిలినేని సంచలనం! మే 1న విడుదల, నటీనటులు ఎవరంటే?

Published: 04-02-2026, 9:05 AM
సమ్మర్ హాలిడేస్‌తో ధీరజ్ మొగిలినేని సంచలనం! మే 1న విడుదల, నటీనటులు ఎవరంటే?
  • ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ మే 1న విడుదల కానుంది.
  • 90s సిరీస్‌తో పాపులర్ అయిన రోహన్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
  • మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటించిన చిన్నారి కూడా ఈ మూవీలో భాగం కానుంది.
  • ఈ సినిమా ద్వారా ధీరజ్ ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.

ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని ‘సమ్మర్ హాలిడేస్’ అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. 90s సిరీస్‌తో గుర్తింపు పొందిన రోహన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

సమ్మర్ హాలిడేస్ మూవీ విడుదల ఎప్పుడు?

Summer Holidays: సినిమా ఇండస్ట్రీలో ప్రతివారం ఎన్నో కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నాయి. ఇలా ప్రతివారం చిన్న హీరోల సినిమాల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి నెలలో కూడా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇలా ఫిబ్రవరిలో విడుదల కాబోయే సినిమాలలో కపుల్ ఫ్రెండ్లీ సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నిర్మాత ధీరజ్ మొగిలినేని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ధీరజ్ నిర్మాణంలో త్వరలో మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

ధీరజ్ ఇదివరకే ఎన్నో సినిమాలకు నిర్మాతక వ్యవహరించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన సమ్మర్ హాలిడేస్ (Summer Holidays)అంటూ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు .ఈ సినిమా సమ్మర్ హాలిడేస్ ను పురస్కరించుకొని మే ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.. ఇక ఈ సినిమాలో నటినటుల విషయానికి వస్తే..90s సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోహన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ రోహన్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు ఎవరు?

రోహన్ తోపాటు 35 చిన్న కథలు కాదు సినిమాలో చిన్న కుర్రాడు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు .అదేవిధంగా చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి పెద్ద కూతురు పాత్రలో నటించిన చిన్నారి కూడా ఈ సినిమాలో భాగం కాబోతోందని తెలుస్తోంది. సరికొత్త కథతో ఈ సమ్మర్ హాలిడేస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

ధీరజ్ మొగిలినేని సినిమాలు..

ధీరజ్ మొగిలినేని సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది?

ఈ నేపథ్యంలోనే సమ్మర్ హాలిడేస్ సినిమాతో సమ్మర్ హాలిడేస్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారకంగా వెల్లడి కానున్నాయి. ఇక ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో ఇప్పటి వరకు ది గర్ల్ ఫ్రెండ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, నరుడు బ్రతుకు నటన అనే సినిమాలకు నిర్మాత సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ది గర్ల్ ఫ్రెండ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు వంటి విజయాల తర్వాత ధీరజ్ మొగిలినేని ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.