|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘పెద్ది’ విడుదల వేళ.. ‘సమ్మర్ హాలిడేస్’ సంచలనం! ధీరజ్ సాహసం వెనుక అసలు కథేంటి?

Published: 18-02-2026, 5:05 PM
‘పెద్ది’ విడుదల వేళ.. ‘సమ్మర్ హాలిడేస్’ సంచలనం! ధీరజ్ సాహసం వెనుక అసలు కథేంటి?
  • వేసవి సెలవులను క్యాష్ చేసుకోవడానికి ‘సమ్మర్ హాలిడేస్’ అనే సినిమా విడుదల కానుంది.
  • నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని తన బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
  • ఈ సినిమా మే 1న విడుదల కానుండగా, రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదల కానుంది.
  • ‘పెద్ది’ విడుదల దగ్గరలో ఉండటంతో ‘సమ్మర్ హాలిడేస్’ విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ధీరజ్ మొగిలినేని ‘సమ్మర్ హాలిడేస్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. అయితే, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల దగ్గరలో ఉండటంతో ఈ సినిమా విడుదలపై అనుమానాలు వస్తున్నాయి.

‘సమ్మర్ హాలిడేస్’ మూవీ వివరాలు

Summer Holidays: ‘సమ్మర్ హాలిడేస్’‌ని క్యాష్ చేసుకోవడానికి సినిమా వాళ్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఐపీఎల్ రాకతో కాస్త ఇష్టం తగ్గింది కానీ, లేదంటే సమ్మర్ ట్రీట్ మాములుగా ఉండేది కాదు. అయినా సరే, కొన్ని చిన్న, పెద్ద చిత్రాలు సమ్మర్‌లో హీటెక్కిస్తూనే ఉంటాయి. మరి అలాంటి ‘సమ్మర్ హాలిడేస్’ని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడో నిర్మాత పెద్ద స్కెచ్చే వేశారు. ఏంటని అనుకుంటున్నారా? ఏకంకా ‘సమ్మర్ హాలిడేస్’ అనే టైటిల్‌తో ఓ మూవీ తీసేస్తున్నారు. అవును, ఇది నిజం. ఈ సమ్మర్‌కి ‘సమ్మర్ హాలిడేస్’ (Summer Holidays) అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

‘పెద్ది’ విడుదలపై నీలినీడలు

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా దూసుకుపోతున్నారు ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni ). ఆయన రీసెంట్ గా పంపిణీ చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రేక్షకుల ఆదరణతో భారీగా కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ‘సమ్మర్ హాలిడేస్’ పేరుతో కొత్త సినిమాను అందించేందుకు ధీరజ్ మొగిలినేని సిద్ధమవుతున్నారు. చిల్డ్రన్ మూవీగా నిర్మించిన ఈ సినిమా టైటిల్‌ను బుధవారం అనౌన్స్ చేశారు నిర్మాత ధీరజ్ మొగిలినేని. టైటిల్ మాత్రమే కాదు, రిలీజ్ డేట్‌ని కూడా ఆయన ప్రకటించారు. మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. మే 1 అనగానే అందరికీ డౌట్స్ వస్తున్నాయి కదా.

ధీరజ్ మొగిలినేని ప్రయత్నం ఫలిస్తుందా?

ఏప్రిల్ 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ‘పెద్ది’ సినిమా (Peddi Movie) విడుదల అంటూ ప్రకటించారు. ‘పెద్ది’ వంటి సినిమా వస్తుంటే రిలీజ్ తర్వాత మినిమమ్ ఒక వారమైనా ఏ సినిమా విడుదల కాదనేలా ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఆ సినిమాపై ఉన్న అంచనాలు అలాంటివి. మరి ధైర్యంగా ఒక రోజు వ్యవధిలోనే ఈ సినిమాను థియేటర్లో వేయాలని ధీరజ్ ప్రయత్నాలు చేస్తుండటం చూస్తుంటే.. ‘పెద్ది’ రిలీజ్‌పై డౌట్ వస్తుంది. ఇప్పటికే ‘పెద్ది’ మరోసారి వాయిదా అంటూ ఇండస్ట్రీలో వార్తలు మొదలయ్యాయి. మార్చి 27న రావాల్సిన ‘పెద్ది’ని ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 30 కూడా కష్టమే అనేలా టాక్ నడుస్తుంది. అందుకే ముందస్తుగా ధీరజ్ కర్చీఫ్ వేసుకుంటున్నారా? అనేలా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘సమ్మర్ హాలిడేస్’ విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మొత్తానికి ‘సమ్మర్ హాలిడేస్’ మే 1న విడుదలవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ‘పెద్ది’ విడుదల వాయిదా పడుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.