|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sundeep Kishan: థ్రిల్లర్ యాక్షన్ రైడ్ లోడింగ్.. హీరో బర్త్ డే స్పెషల్ ‘SK-31’ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసి హైప్ పెంచిన మేకర్స్

Published: 07-05-2025, 5:50 AM
Sundeep Kishan: థ్రిల్లర్ యాక్షన్ రైడ్ లోడింగ్.. హీరో బర్త్ డే స్పెషల్ ‘SK-31’ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసి హైప్ పెంచిన మేకర్స్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన SK-31 సినిమా షూటింగ్ జరుగుతోంది. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా నుంచి ఓ యాక్షన్ ఫిల్డ్ వీడియోను విడుదల చేసి మేకర్స్ హైప్ పెంచారు.

Key Points

1

సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా SK-31 నుండి ప్రత్యేక వీడియో విడుదల

2

యాక్షన్ సన్నివేశాలతో అభిమానులను ఆకట్టుకుంటున్న వీడియో

4

జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా

SK-31 నుండి ప్రత్యేక వీడియో విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(sundeep Kishan) గత ఏడాది రాయన్, ఊరు పేరు భైరవకోన వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక ఇటీవల ఆయన ‘మజాకా’(Mazaka) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 26న థియేటర్స్‌లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సందీప్ కిషన్ ఓ భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. అయితే ఈ సినిమాను దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్(Jason Sanjay) తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. ఇక ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్(Lyca Production) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు సందీప్ కిషన్ పుట్టినరోజు కావడంతో మూవీ మేకర్స్ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. షూటింగ్’కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. డైనమిక్ సందీప్ కిషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు! మీ ప్రత్యేకమైన శైలి సినిమా పట్ల మక్కువ ప్రతి పాత్రలోనూ ప్రకాశిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్స్ అంతులేని ఆనందంతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాం’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. అది చూసిన వారంతా థ్రిల్లర్ యాక్షన్ రైడ్ లోడింగ్ అని కామెంట్లు పెడుతున్నారు.

యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న వీడియో

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ ప్రాజెక్ట్

చివరగా, సందీప్ కిషన్ అభిమానులకు ఈ వీడియో ఓ పెద్ద ట్రీట్. SK-31 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.