|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూపర్‌ స్టార్ కృష్ణతో సినిమా తీసి అడ్రస్‌ లేకుండా పోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? కోలుకోలేని దెబ్బ

Published: 27-07-2025, 1:29 AM
సూపర్‌ స్టార్ కృష్ణతో సినిమా తీసి అడ్రస్‌ లేకుండా పోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? కోలుకోలేని దెబ్బ

తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణతో సినిమా నిర్మించి, ఘోరమైన నష్టాలను ఎదుర్కొని, కెరీర్‌లో దిగజారిపోయిన ఓ స్టార్ హీరో కథ ఇది. ఆ హీరో ఎవరో, ఆయన ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడో తెలుసుకుందాం.

Key Points

1

సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కాంతారావు నిర్మించిన 'ప్రేమజీవులు' సినిమా ఘోరంగా బాక్సాఫీస్ వద్ద ఓడిపోయింది.

2

ఈ సినిమా పరాజయం వల్ల కాంతారావు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారు.

4

కృష్ణ గొప్ప మనస్సు గల వ్యక్తి అయినప్పటికీ, ఈ సినిమా నష్టాలను భరించలేక కాంతారావు కష్టకాలం ఎదుర్కొన్నారు.

కాంతారావు: తొలితరం తెలంగాణ హీరో

సినిమా ఇండస్ట్రీలో నిర్మాత జీవితం గాలి బుడగలాంటిది. ఏ సినిమా ముంచుతుందో, ఏ సినిమా లేపుతుందో తెలియదు. ఎన్ని సినిమాలు లేపినా, ఒక్క సినిమా చాలు అడ్రస్‌ లేకుండా పోవడానికి.

సూపర్‌ స్టార్‌ కృష్ణతో ఓ స్టార్‌ హీరో నిర్మాతగా ఓ సినిమాని నిర్మించారు. ఆ మూవీ పరాజయం ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఆయన డౌన్‌ఫాల్‌ స్టార్ట్ అయ్యింది. కొన్నాళ్లకి అడ్రస్‌ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.

సూపర్‌ స్టార్‌ కృష్ణని ఇండస్ట్రీలోనే గొప్పమనసు కలిగిన హీరో అంటారు. తనతో సినిమాలు నిర్మించిన నిర్మాతలకు అండగా ఉంటాడని, సినిమా నష్టాలు వస్తే తన పారితోషికం తిరిగి ఇస్తాడని అంటుంటారు.

చాలా మంది నిర్మాతలు కూడా ఆ విషయాన్ని చెప్పారు. ఆ విషయంలో దేవుడిగా పిలుస్తుంటారు. కానీ ఓ హీరో మాత్రం ఆయన సహాయం తీసుకోలేదు.

దారుణంగా నష్టపోయి ఆ తర్వాత కనుమరుగు అయ్యారు. ఆయన ఎవరో కాదు తొలితరం తెలంగాణ హీరోగా, కత్తి వీరుడు కాంతారావు.

కాంతారావు.. తొలితరం హీరో. ఎన్టీఆర్‌, ఏఎన్నార్, ఎస్వీఆర్‌ల టైమ్‌లో హీరోగా రాణించారు. అనేక సినిమాల్లో హీరోగా చేశారు.

‘ప్రేమజీవులు’ సినిమా పరాజయం

ఓ వైపు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి వారితో కలిసి సినిమాలు చేస్తూనే తాను సోలో హీరోగా కూడా పలు సినిమాలు చేసి విజయాలు సాధించారు. మంచి స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.

కత్తివీరుడిగా రాణించారు, కత్తి యుద్ధాలకు కేరాఫ్‌గా నిలిచారు. పౌరాణిక చిత్రాల్లో చాలా వరకు కాంతారావు ఉండాల్సిందే అనేట్టుగా ఉండేది. ఎన్టీఆర్‌ సైతం తన సినిమాల్లో కాంతారావుని తీసుకునేవారు. అలా నటప్రపూర్ణగా కీర్తించబడ్డారు కాంతారావు.

కానీ కాంతారావు కెరీర్‌ డౌన్‌ అయ్యింది మాత్రం నిర్మాతగానే అని చెప్పాలి. ఆయన నిర్మాతగా హేమ ఫిల్మ్స్ పై `సప్తస్వరాలు` చిత్రం నిర్మించారు. తనే హీరో.

ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కాంతారావు మంచి బూస్ట్ ఇచ్చింది. అదే ఏడాది `గండరగండుడు` మూవీని నిర్మించారు. ఇది సరిగా ఆడలేదు.

రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా `ప్రేమజీవులు` అనే మూవీని నిర్మించారు. ఇందులో తనుకూడా ఓ హీరో. కేఎస్‌ఆర్‌ దాస్‌ దర్శకుడు.

1971లో వచ్చిన ఈ మూవీ ఘోర పరాజయం చెందింది. అప్పట్లో భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. కానీ బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ చిత్రంతోనే కాంతారావు ఉన్నదంతా పోగొట్టుకున్నారట.

కృష్ణ సహాయం మరియు కాంతారావు కెరీర్

ఆ తర్వాత కెరీర్‌ డౌన్‌ అయ్యిందని చెప్పారు కాంతారావు కూతురు సుశీల. ఈ సినిమా పోయినందుకు కృష్ణ నష్టాలను రిటర్న్ ఇస్తానని అన్నారట. కానీ కాంతారావు తీసుకోలేదట.

అదే ఆయన చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత నిర్మాతగా ఒకటి రెండు చిత్రాలు చేశారు. అవి కూడా ఆడలేదు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డటయ్యింది. మరింతగా కోలుకోలేకపోయారు కాంతారావు.

ఆ తర్వాత నటుడిగానూ సినిమాలు చేశారు. కానీ హీరోగానూ సినిమాలు రాలేదు. ఇతర హీరోల చిత్రాల్లో క్యారెక్టర్స్ వేస్తూ కాలం వెల్లదీశారు, కానీ ఆ పూర్వ వైభవం పొందలేకపోయారు.

ఆ తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ చేయలేదని, ఆదుకునేవారే లేరని తెలిపింది కూతురు సుశీల.

నాన్నగారు కూడా వచ్చిన డబ్బుని సరిగా వాడుకోలేకపోయారని, ఎలా డబ్బుని పెంచుకోవాలో తెలియలేదని, దీంతో ఆయనకష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు కూతురు. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె వెల్లడించారు.

కాంతారావు ‘ప్రేమజీవులు’ సినిమా పరాజయంతో తీవ్రమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కొని, తన కెరీర్‌లో తీరని లోటును అనుభవించాడు. ఈ ఘటన తెలుగు సినిమా రంగంలో ఒక విషాదకరమైన అధ్యాయంగా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.