|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కృష్ణ ‘పాడిపంటలు’ విధ్వంసం! సంక్రాంతికి ఎన్టీఆర్, శోభన్ బాబుకి దిమ్మతిరిగే షాక్!

Published: 26-01-2026, 10:05 PM
కృష్ణ 'పాడిపంటలు' విధ్వంసం! సంక్రాంతికి ఎన్టీఆర్, శోభన్ బాబుకి దిమ్మతిరిగే షాక్!
  • సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పాడిపంటలు’ మూవీ సంచలన విజయం!
  • 1976 సంక్రాంతికి విడుదలై, కృష్ణకు ‘సంక్రాంతి మొనగాడు’ అనే బిరుదు తెచ్చిన చిత్రం.
  • విజయ నిర్మలతో కృష్ణ జోడీ, పీ. చంద్రశేఖర్ దర్శకత్వం – సినిమాకు భారీ విజయాన్ని అందించాయి.
  • గ్రామీణ నేపథ్యంలో తెలుగుదనం ఉట్టిపడేలా రూపొందిన ‘పాడిపంటలు’ చిత్రం.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘పాడిపంటలు’ చిత్రం ఒక సంచలనం. ఈ సినిమా కృష్ణ కెరీర్‌ను ఎలా మార్చిందో, సంక్రాంతికి ఆయనకు ఎలాంటి విజయాన్ని అందించిందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి.

కృష్ణ కెరీర్‌ను మార్చిన ‘పాడిపంటలు’!

సూపర్‌ స్టార్‌ కృష్ణ స్టార్‌ డమ్‌ని పెంచి ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌ని చేసిన మూవీ `అల్లూరి సీతారామరాజు`. 1974లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాని చాలా వరకు కృష్ణనే డైరెక్ట్ చేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా ఆయన నట విశ్వరూపం చూపించారు. దీంతో ఆడియెన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ విజయం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారంటే అది సృష్టించిన సంచలనాలు ఏం స్థాయిలో ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు.

`అల్లూరి సీతారామరాజు` వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత కృష్ణ నటించిన అన్నీ సినిమాలు పరాజయం చెందాయి. ఏకంగా 14 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక కృష్ణ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఇండస్ట్రీ గుసగుసలు కూడా స్టార్ట్ అయ్యాయి. నిర్మాతలు వెనకడుగు వేశారు. ఓ దశలో కృష్ణతో సినిమాలు చేసేందుకు ఒక్క నిర్మాత కూడా రాలేదు. దీంతో కొంత గ్యాప్‌ తీసుకునే తానే నిర్మాతగా మారి `పాడిపంటలు` మూవీని తీశారు. దీనికి పీ చంద్రశేఖర్‌(పి.సి. రెడ్డి) దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించారు.

‘సంక్రాంతి మొనగాడు’గా కృష్ణ రికార్డులు!

1976 జనవరి 14న `పాడి పంటలు` విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కృష్ణ బౌన్స్ బ్యాక్‌ అయ్యేలా చేసింది. ఆయన రేంజ్‌ ఏంటో చూపించింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి పల్లె జనం సైతం బ్రహ్మరథం పట్టారు. తెలుగుదనం ఉట్టిపడేలా మూవీని రూపొందించారు. పల్లెటూర్లలోని సిరిసంపదలను కళ్లకి కట్టినట్టుగా చూపించారు. అప్పటికి వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న కృష్ణ కెరీర్‌ని మలుపు తిప్పిందీ చిత్రం. సంక్రాంతి పండక్కి రావడం, కథ కూడా తెలుగు పల్లెటూర్లని తలపించేలా ఉండటం, గ్రామాభ్యుదయ కథాంశం కావడం ఇవన్నీ ఈమూవీ విజయానికి కారణమయ్యాయి.

అయితే అప్పటి వరకు సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన సినిమాలు సంక్రాంతికి పెద్దగా రాలేదు. అడపాదడపా ఒకటి అరా వచ్చినా, సంక్రాంతిని స్పెషల్‌గా భావించలేదు. రెగ్యూలర్‌ రిలీజ్‌లో కొన్ని సంక్రాంతికి వచ్చాయి. కానీ `పాడిపంటలు` మాత్రం సంక్రాంతి పండక్కి ఉన్న దమ్మేంటో చూపించింది. ఈ సినిమాకి ఊహించని కలెక్షన్లు రావడంతో ఇక కృష్ణ సంక్రాంతి పండగని స్పెషల్‌గా భావించారు. ఆ తర్వాత వరుసగా సంక్రాంతి పండక్కి తన సినిమాలు ఉండేలా చూసుకున్నారు. అలా చాలా వరకు ఆయన నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదలై బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. అప్పట్లో కృష్ణని సంక్రాంతి మొనగాడుగా పిలిచేవారు.

విజయ నిర్మల, కృష్ణల బ్లాక్ బస్టర్ మూవీ!

ఇదిలా ఉంటే `పాడిపంటలు` సమయంలో ఈ మూవీకి పోటీగా, ఎన్టీఆర్‌ `భీమకవి`, శోభన్‌ బాబు నటించిన `పిచ్చిమారాజు` చిత్రాలు విడుదలయ్యాయి. ఆ టైమ్‌లో ఈ హీరోలు ఫామ్‌లో ఉన్నారు. అలాంటి టైమ్‌లో వారికి పోటీగా `పాడిపంటలు` మూవీని రిలీజ్‌ చేస్తే పరాజయం తప్పదని చాలా మంది కృష్ణని వ్యతిరేకించారట. కానీ ఎవరి మాట వినకుండా మూవీని రిలీజ్‌ చేశారు. బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. `పాడిపంటలు` దెబ్బకి ఎన్టీఆర్‌, శోభన్‌ బాబు చిత్రాలు అడ్రస్‌ లేకుండా పోయాయట. అలా కృష్ణ సంక్రాంతి మొనగాడిగా నిలవడానికి `పాడిపంటలు` భీజం వేసిందని చెప్పొచ్చు.

`పాడిపంటలు` తర్వాత వరుసగా `కురుక్షేత్రం`, `ఇంద్రధనస్సు`, `భలే కృష్ణుడు`, `ఊరికి మొనగాడు`, `బెజవాడ బెబ్బులి`, `ఇద్దరు దొంగలు`, `అగ్ని పర్వతం`, `తండ్రీ కొడుకు ఛాలెంజ్‌`, `కలియుగ కర్ణుడు`, `రాజకీయ చదరంగం`, `ఇన్‌ స్పెక్టర్‌ రుద్ర`, `పరమశివ`, `నెంబర్‌ వన్‌` `అమ్మదొంగ` వంటి చిత్రాల వరుసగా సంక్రాంతికి విడుదలై మెప్పించాయి. ఇందులో చాలా వరకు విజయం సాధించాయి.

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ‘పాడిపంటలు’ ఒక మైలురాయి. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.