
📌 Key Points
- అఖండ 2 వాయిదాపై నిర్మాత సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
- ఆర్థిక విషయాలు ప్రేక్షకులెందుకు పట్టించుకోవాలని, సినిమా చూస్తే చాలని అన్నారు.
- 14 రీల్స్ సంస్థ ఎరోస్‌కు రూ. 28 కోట్లు బకాయి పడటమే వాయిదాకు ప్రధాన కారణం.
- బకాయిలు చెల్లించే వరకు సినిమా విడుదల చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అఖండ 2 రిలీజ్ వాయిదాపై నిర్మాత సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక విషయాలు ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం సినిమా చూస్తే చాలని స్పష్టం చేశారు. రూ. 28 కోట్ల బకాయిల కేసు కారణంగానే సినిమా వాయిదా పడినట్లు వార్తలున్నాయి.
అఖండ 2 వాయిదాపై సురేష్ బాబు వ్యాఖ్యలు
అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా పడటంపై నిర్మాత సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్థిక విషయాలు పబ్లిగ్గా మాట్లాడాల్సిన అవసరం లేదని, ఆడియెన్స్ సినిమా చూస్తే చాలు కదా అని అతడు అనడం విశేషం.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలుసు కదా. దీనిపై తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా స్పందించాడు. సైక్ సిద్ధార్థ మూవీకి ప్రెజెంటర్ గా ఉన్న అతడు.. ప్రెస్ మీట్ లో వివిధ అంశాలపై మాట్లాడాడు. అఖండ 2 ఇష్యూ త్వరలోనే పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు.
ఆర్థిక విషయాలపై నిర్మాత అభిప్రాయం
అఖండ 2పై సురేష్ బాబు ఏమన్నాడంటే?
“ఆ విషయం గురించి మాట్లాడటం వల్లే రావడం ఆలస్యమైంది. అది పరిష్కారమవుతుంది. అయినా అవన్నీ ఆర్థిక విషయాలు. వాటి గురించి పబ్లిగ్గా మాట్లాడకూడదు. దురదృష్టవశాత్తూ వ్యాపార విషయాలు మరీ ఎక్కువగా జనాల్లోకి వెళ్తున్నాయి. ప్రతి ఒక్కడూ ఇలా అయిందంట.. ఇన్ని డబ్బులంట అని మాట్లాడుతున్నారు. ఆడియెన్స్ సినిమా చూస్తే చాలు. వాళ్లకు ఇవన్నీ ఎందుకు ఇవ్వడం. ఆర్థిక సమస్యలు ఉంటాయి. గతంలోనూ ఉన్నాయి. ముందే ప్లాన్ చేసుకుంటే సమసిపోతాయి. ఇది కూడా పరిష్కారమవతుంది” అని సురేష్ బాబు అన్నాడు.
అఖండ 2 వాయిదాకు అసలు కారణం ఏమిటి?
అఖండ 2 రిలీజ్ వాయిదా ఎందుకంటే?
ఎరోస్ సంస్థకు 14 రీల్స్ దాదాపు రూ. 28 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం. ఈ బకాయిలు చెల్లించే వరకు ‘అఖండ 2’ సినిమాను విడుదల చేయడం, పంపిణీ చేయడం లేదా వాణిజ్యపరంగా వాడుకోవడం కుదరదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్టు కేసు కారణంగానే చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది.
అఖండ 2 వాయిదా వెనుక ఆర్థిక లావాదేవీల చిక్కుముడి ఉందని సురేష్ బాబు వ్యాఖ్యలు, కోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రేక్షకులు కేవలం సినిమాను ఆస్వాదించాలని ఆయన కోరారు. ఈ సమస్య త్వరగా పరిష్కారమై సినిమా విడుదల కావాలని ఆశిద్దాం.


