|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేసింది! మాస్ మహారాజ్ డబుల్ రొమాన్స్.. ఫ్యాన్స్‌కు పండగే!

Published: 19-12-2025, 6:44 AM
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది! మాస్ మహారాజ్ డబుల్ రొమాన్స్.. ఫ్యాన్స్‌కు పండగే!
  • రవితేజ హీరోగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా రూపొందుతోంది.
  • కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు.
  • టీజర్‌లో రవితేజ కామెడీ, ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ హైలైట్‌గా నిలిచాయి.
  • ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ విడుదలైంది. రవితేజ విలక్షణ కామెడీ, ఇద్దరు హీరోయిన్‌లతో రొమాన్స్ టీజర్‌కు హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా

మాస్ మహారాజ్ రవితేజ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన రవితేజ, ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేసి దూసుకు వెళ్తున్నారు. హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ, దుమ్ము లేపుతున్నారు. అయితే అలాంటి మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమానే భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవితేజ హీరోగా వస్తున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.

ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్ చేస్తూ చిత్ర బృందం రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. వదిన వాళ్ళ చెల్లెలు అంటే నా భార్యగా అంటూ రవితేజ చేసే కామెడీ టీజర్ లో అందరిని ఆకట్టుకుంటుంది. ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో రవితేజ చేసే రొమాన్స్ కూడా చాలా కొత్తగా ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాకు హైప్ పెంచింది. కాగా భర్త మహాశయులకు విజ్ఞప్తిస‌ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ కానుంది.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ విశేషాలు

సంక్రాంతి బరిలో రవితేజ డబుల్ రొమాన్స్

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ చూస్తుంటే, సినిమా పక్కా ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.