|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘సూర్య-46’ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి.. మరో సంజయ్ రామస్వామిని చూస్తారంటూ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 28-06-2025, 8:20 AM
‘సూర్య-46’ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి.. మరో సంజయ్ రామస్వామిని చూస్తారంటూ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కోలీవుడ్ స్టార్ సూర్య నటించే సూర్య-46 చిత్రంపై వెంకీ అట్లూరి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో సూర్య కామన్ మ్యాన్ గా కనిపిస్తారని, అన్ని ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు.

Key Points

1

సూర్య-46 చిత్రంలో సూర్య హ్యాపీ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తారు.

2

ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.

4

మలయాళ బ్యూటీ మమిత బైజు, రవీనా టాండన్, రాధిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సూర్య-46 చిత్రం గురించి తాజా సమాచారం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు. అయినప్పటికీ హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా తనకు నచ్చిన కథలను ఒకే చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ‘సూర్య-46’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. ఇక ఇందులో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండన్(Raveena Tandon), రాధిక కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ‘సూర్య-46’ మూవీ జూలైలో షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘చాలా రోజుల తర్వాత హ్యాపీ ఫ్యామిలీ సినిమాలో సూర్యను చూడబోతున్నారు. ఇందులో అన్ని ఎమోషన్స్ కలిగి ఉంటాయి. హీరో కామన్ మ్యాన్‌‌లా ఉండండు.. మరో సంజయ్ రామస్వామి క్యారెక్టర్‌లో సూర్యను చూస్తారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సూర్య కొత్త పాత్ర వివరాలు

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య-46 చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. సూర్య అభిమానులకు ఇది పండగే అని చెప్పడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.