|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mass Jathara pre release event : ర‌వితేజ కోసం గ‌జినీ.. మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడంటే..?

Published: 27-10-2025, 4:11 AM
Mass Jathara pre release event : ర‌వితేజ కోసం గ‌జినీ.. మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడంటే..?

రవితేజ హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 28న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ సూర్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

రవితేజ 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 28న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో జరుగుతుంది.

2

ఈ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

4

ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు

Mass Jathara pre release event : మాస్ మహారాజా రవితేజ (Raviteja) న‌టిస్తున్న చిత్రం మాస్ జాత‌ర‌. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీలీల క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా హైద‌రాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు స‌న్నాహ‌కాలు చేస్తోంది. అక్టోబ‌ర్ 28 (మంగ‌ళ‌వారం) హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్స్‌లో ఈవెంట్‌ను నిర్వ‌హించనున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హాజ‌రుకానున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

గెస్ట్‌గా కోలీవుడ్ స్టార్ సూర్య

Chiranjeevi : డీప్‌ ఫేక్‌ బారిన చిరు.. కేసు న‌మోదు

అంచనాలతో ‘మాస్ జాతర’ విడుదల

ధ‌మాకా త‌రువాత ర‌వితేజ‌, శ్రీలీల న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ మూవీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇటీవ‌లే ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ స‌ర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఈ చిత్ర నిడివి 160 నిమిషాలుగా తెలుస్తోంది.

‘మాస్ జాతర’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్య రాకతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరింత గ్రాండ్‌గా జరగనుంది. రవితేజ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.