
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూర్య కుటుంబం గురించి కొన్ని రూమర్లు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఆ రూమర్లకు చెక్ పెట్టే విధంగా కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుక జరిగింది.
Key Points
సూర్య కుటుంబం గురించి వచ్చిన అన్ని రూమర్స్‌కు చెక్ పెట్టింది కూతురు దియా గ్రాడ్యుయేషన్.
దియా గ్రాడ్యుయేషన్ వేడుకలో సూర్య, జ్యోతిక కుటుంబ సభ్యులంతా ఒకేచోట కనిపించారు.
జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారనే వార్తలన్నీ నిజం కాదని తేలింది.
17 ఏళ్ల దియా ఇంటర్మీడియట్ పూర్తి చేసి, త్వరలోనే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తుంది.
దియా గ్రాడ్యుయేషన్ వేడుక
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ టైంలో మాత్రం ‘కంగువ’, ‘రెట్రో’ చిత్రాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కనబెడితే కొన్నాళ్ల క్రితం సూర్య ఫ్యామిలీ గురించి అనుకోని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు కూతురు గ్రాడ్యుయేషన్‌తో వాటన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.
తమిళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న సూర్య.. తనతో పాటు కలిసి నటించిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. కూతురు దియా, కొడుకు దేవ్ కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం పిల్లల్ని పట్టుకుని జ్యోతిక.. ముంబైలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో లేనిపోని రూమర్స్ వచ్చాయి.
కుటుంబ సభ్యులందరూ ఒకేచోట
జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారని.. ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ వినిపించాయి. కానీ తాజాగా కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అటు సూర్య తల్లిదండ్రులు, ఇటు జ్యోతిక పేరెంట్స్ పాల్గొన్నారు. అందరూ ఒక్కచోట కనిపించడంతో ఇప్పటివరకు వినిపించిన మాటలన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది.
రూమర్స్‌కు చెక్
సూర్య కూతురు దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. ప్రస్తుతం ఇంటర్మీడియట్(ప్లస్ టూ) పూర్తి చేసింది. త్వరలో పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. మరి తల్లిదండ్రుల్లా దియా కూడా ఇండస్ట్రీలోకి వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం చూడటానికి మాత్రం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత అందంగా ఉంది. మరి జ్యోతిక.. తన కూతురి గురించి ఏం ఆలోచిస్తుందో చూడాలి?
చివరగా, సూర్య కుటుంబం ఒకటేనని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ వేడుక స్పష్టం చేసింది. దియా భవిష్యత్తు చదువులకు శుభాకాంక్షలు.


