|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూర్య విధ్వంసం: బాక్సాఫీస్ బద్దలే! దిమ్మతిరిగే లైనప్ చూస్తే షాకే!!

Published: 17-01-2026, 1:15 AM
సూర్య విధ్వంసం: బాక్సాఫీస్ బద్దలే! దిమ్మతిరిగే లైనప్ చూస్తే షాకే!!
  • సూర్య 46వ చిత్రం: టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో భారీ ప్రాజెక్ట్!
  • 47వ సినిమా: జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య సరికొత్త అవతారం!
  • పా రంజిత్ దర్శకత్వంలో సూర్య 49వ చిత్రం: అంచనాలు ఆకాశాన్ని తాకేలా!
  • సూర్య 50వ సినిమా: జాగారం స్టూడియోస్ బ్యానర్‌పై గ్రాండ్ ఎంట్రీ!

కోలీవుడ్ స్టార్ సూర్య వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఆయన నటిస్తున్న భారీ ప్రాజెక్టులు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. సూర్య లైనప్ చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

వెంకీ అట్లూరితో సూర్య మాస్ ఎంట్రీ!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya)కు ఇటీవలి కాలం అంతగా కలిసి రావడం లేదు. ఎంత శ్రమించినా ఆ శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఇటీవల విడుదలైన ‘రెట్రో’, ‘కంగువా’ సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారిన విషయం తెలిసిందే. అయినా సరే, నిరాశకు లోనుకాకుండా సూర్య మాత్రం ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల లైనప్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే. తాజాగా సూర్య నటించబోయే రాబోయే చిత్రాల జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరుప్పు’(Karuppu) చిత్రంలో సూర్య నటిస్తున్నాడు.

షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడినట్లు సమాచారం. దీని తర్వాత సూర్య తన 46వ ప్రాజెక్ట్‌ను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేయనున్నాడు. అలాగే 47వ సినిమాను జితూ మాధవన్ తెరకెక్కించనుండగా, 48వ చిత్రాన్ని పాండిరాజ్ దర్శకత్వంలో పూర్తి చేయనున్నాడు. ఇక 49వ ప్రాజెక్ట్‌కు పా రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా, సూర్య కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 50వ చిత్రాన్ని జాగారం స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. మొత్తానికి, సూర్య లైనప్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారి అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. సూర్య ఊపు మామూలుగా లేదుగా అని కామెంట్లు చేస్తున్నారు.

పా రంజిత్ డైరెక్షన్లో సూర్య సునామీ

సూర్య 50వ సినిమా: రికార్డుల వేట షురూ!

సూర్య రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి. ఆయన అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్త. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.