
📌 Key Points
- సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తి.
- ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ టైటిల్ పరిశీలనలో ఉంది.
- సినిమాను 2026 మే 1న విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచన.
- ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు వెంకీ అట్లూరి వెల్లడి.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ టైటిల్ పరిశీలనలో ఉండగా, 2026 మే 1న విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
సూర్య – వెంకీ అట్లూరి చిత్రం షూటింగ్ పూర్తి
Suriya -Venky Atluri: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.. సూర్య తన 45వ సినిమా అయిన కరుప్పు షూటింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు సూర్య తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యకు జోడిగా మమిత బైజు హీరోయిన్ గా నటించి సందడి చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ అలాగే టైటిల్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాని 2026 మే1 వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతోంది. అలాగే ఈ సినిమాకు “విశ్వనాథన్ అండ్ సన్స్ ” (vishwanathan and son’s)అని టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.
పరీశీలనలో టైటిల్, విడుదల తేదీపై అంచనాలు
ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని దర్శకుడు వెంకీ అట్లూరి పలు సందర్భాలలో తెలియజేశారు. ఈ సినిమా ద్వారా మరో సంజయ్ రామస్వామిని మీరు చూడబోతున్నారు అంటూ ఈయన సినిమా పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఈ విషయాలను అధికారికంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.
జిత్తు మాధవన్ డైరెక్షన్లో సూర్య..
సూర్య ఇతర ప్రాజెక్టుల వివరాలు
ఇక సూర్య వెంకీ అట్లూరితో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈయన తన తదుపరిచిత్రం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. సూర్య తన 47వ సినిమాను ప్రముఖ మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ సినిమాలో సూర్యకు జోడిగా నజ్రియా నటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ సూర్య కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన చివరిగా రెట్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
సూర్య 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్, విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


