|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ పై సుస్మిత కొణిదెల సంచలన కామెంట్స్! బాబాయ్ కాదు భయపెట్టే వ్యక్తి!!

Published: 09-03-2026, 12:35 AM
పవన్ కళ్యాణ్ పై సుస్మిత కొణిదెల సంచలన కామెంట్స్! బాబాయ్ కాదు భయపెట్టే వ్యక్తి!!
  • పవన్ కళ్యాణ్ అంటే బాబాయ్ మాత్రమే కాదు బ్రదర్ అని తెలిపిన సుస్మిత!
  • చిన్నపుడు పవన్ కళ్యాణ్ భయానకమైన హారర్ కథలు చెప్పేవారని సుస్మిత వెల్లడి!
  • పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ ట్రెండ్ సెట్టర్ అని కొనియాడిన సుస్మిత కొణిదెల!
  • పవన్ కళ్యాణ్ లో ఆధ్యాత్మికత, తాత్వికత ఉన్నాయని తెలిపిన సుస్మిత!

చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల తాజాగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో చూద్దాం!

పవన్ కళ్యాణ్ అంటే బాబాయ్ మాత్రమే కాదు!

Sushmita Konidela : చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఫ్యాషన్ డిజైనర్ గా సినీ పరిశ్రమలో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు నిర్మాతగా దూసుకుపోతుంది. సుస్మిత ఇటీవలే చిరంజీవిని హీరోగా పెట్టి మన శంకర వరప్రసాద్ గారు సినిమా తీసి భారీ విజయం సాధించింది.

చిన్నపుడు హారర్ కథలు చెప్పిన పవన్ కళ్యాణ్!

తాజాగా సుస్మిత ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.

పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ ఒక ట్రెండ్!

సుస్మిత మాట్లాడుతూ.. ఆయన కేవలం బాబాయ్ మాత్రమే కాదు బ్రదర్ కూడా. బాబాయ్ దగ్గర హాలీవుడ్ సినిమాలు చాలా ఉండేవి. గాడ్‌ఫాదర్, స్టార్ వార్స్.. లాంటి హాలీవుడ్ సినిమాలను ఆయనే మాకు పరిచయం చేసారు. ఇంగ్లీష్ మ్యూజిక్ కూడా ఆయనే వినిపించేవాళ్ళు. చిన్నప్పుడు రాత్రి పూట బాబాయ్ నన్ను, చరణ్ ని.. ఇలా పిల్లలందర్నీ కుర్చోబెట్టుకొని హారర్ కథలు చెప్పేవాళ్ళు. నాకు హారర్ స్టోరీస్ అంటే ఇష్టం. నేను వినేదాన్ని కానీ మిగితా పిల్లలు ఆ కథలకు భయపడి వెళ్లిపోయేవాళ్లు. ఆయన డ్రెస్సింగ్ లో ఏం వేసుకున్నా ట్రెండ్ అవుతుంది. కానీ బాబాయ్ లో ఉన్న మరో కోణం ఆధ్యాత్మికత, తాత్వికత మమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అని తెలిపింది.

సుస్మిత కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.