|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ హీరో సంస్థకే సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ హక్కులు..!

Published: 04-10-2025, 10:51 AM
ఆ హీరో సంస్థకే సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ హక్కులు..!

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి చెందిన శ్రేష్ట్ మూవీస్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది.

Key Points

1

విష్ణు విశాల్ నటించిన 'ఆర్యన్' సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.

2

ప్రవీణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ హీరోయిన్లు.

4

'ఆర్యన్' చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

‘ఆర్యన్’ చిత్ర కథాంశం & నటీనటులు

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal)భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. విభిన్న కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. విష్ణు విశాల్ నటిస్తున్న సినిమాల్లో ‘ఆర్యన్’(Aaryan) ఒకటి. ప్రవీణ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని ఆర్యన్ రమేష్, సుబ్రా సమర్పణలో విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath), వాణి భోజన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. డైరెక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండగా.. ‘ఆర్యన్’లో విష్ణు విశాల్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. ఇటీవల విడుదలైన టీజర్ మరింత హైప్ పెంచిందనడంలో అతిశయోక్తి లేదు.

ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన విష్ణు విశాల్ ‘ఆర్యన్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు. అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ బ్యానర్‌లో ‘ఆర్యన్’ తెలుగు రాష్ట్రాల్లోకి రాబోతుండటం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ.. త్వరలోనే ట్రైలర్, ఆడియో లాంచ్ కూడా నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం తెలిపారు.

తెలుగు థియేట్రికల్ రిలీజ్ హక్కులు ఎవరికి?

విడుదల తేదీ & మరిన్ని వివరాలు

మొత్తంగా, ‘ఆర్యన్’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రముఖ బ్యానర్ ద్వారా తెలుగులో విడుదలవుతుండటం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. విష్ణు విశాల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.