
📌 Key Points
- నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ‘స్వయంభు’ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.
- ఈ సినిమా మైథలాజికల్ డ్రామాగా రూపొందుతోంది, నిఖిల్ ఇందులో యుద్ధంలో వీరుడుగా నిలిచే రాజు పాత్రలో నటిస్తున్నాడు.
- సంయుక్తా మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది.
- చిత్ర నిర్మాతలు పెడుతున్న భారీ బడ్జెట్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది; ఇది రిస్క్ అవుతుందేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ‘స్వయంభు’ సినిమా అప్డేట్ వచ్చేసింది. తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే, ఈ భారీ బడ్జెట్ విషయంలో నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది.
నిఖిల్ స్వయంభు: భారీ బడ్జెట్ కథనం
Swayambhu : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారాడు.. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు చిత్రంలో నటిస్తున్నాడు. తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది.. మైథలాజికల్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ యుద్ధంలో వీరుడుగా నిలిచే రాజు పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు. షూటింగ్ అప్డేట్ ఇవ్వకుండా సినిమాను పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. ఈ క్రమంలో ఈ మూవీ బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ పెట్టి నిర్మాతలు రిస్క్ చేస్తున్నారేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మూవీ బడ్జెట్ ఎంత? నిఖిల్ లుక్ గురించి ఒకసారి తెలుసుకుందాం..
నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న ఒక చారిత్రక నేపథ్యమున్న సినిమా స్వయంభు.. నిఖిల్ ఈ సినిమాలో ఒక యోధుడి (రాజు) పాత్రలో కనిపించనున్నారు.. సంయుక్తా మీనన్ మరియు నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. పాన్-ఇండియా సినిమా, తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో సినిమాను తెరకేక్కిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఈ సినిమా విజువల్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారట.. బాహుబలి, RRR రేంజులో విజువల్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. ఈ విజువల్స్ కోసం చిత్ర యూనిట్ బడ్జెట్ విషయంలో వెనకడుగు వెయ్యడం లేదు.. నిఖిల్ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేస్తున్నారేమో.. తేడా కొడితే పరిస్థితి ఏంటి? అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి..
పాన్ ఇండియా చిత్రం: నటీనటులు
నిర్మాతల రిస్క్: కారణాలు ఏమిటి?
హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నిఖిల్ గతంలో ఎన్నడు కనిపించిన విధంగా కనిపించనున్నాడు. అతని లుక్ సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. శక్తివంతమైన రాజుగా నిఖిల్ శత్రువుల మీద విరుచుకుపడే ఈ సీక్వెన్స్, విజువల్స్ పరంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని మేకర్స్ హింట్ ఇస్తున్నారు. ఈ సీన్ కోసం నిఖిల్ కత్తియుద్ధం, గుర్రపు స్వారీ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని తెలుస్తుంది. రవి బస్రూర్ సంగీతం, ముఖ్యంగా నిఖిల్ ఎంట్రీ సీన్ వద్ద ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని చెబుతున్నారు.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.. వచ్చే ఫిబ్రవరి 13 న సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.. గతంలో వచ్చిన కార్తికేయ 2 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది… మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..
నిఖిల్ ‘స్వయంభు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ విజువల్స్ కోసం ఏమాత్రం రాజీ పడకుండా పనిచేస్తోంది. మరి ఈ భారీ బడ్జెట్ రిస్క్‌కు తగ్గ ఫలితం లభిస్తుందో లేదో వేచి చూడాలి.


