|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Swayambhu: విడుదల తేదీ ఖరారు కావాలంటే అదే కీలకం

Published: 13-03-2026, 6:35 AM
Swayambhu: విడుదల తేదీ ఖరారు కావాలంటే అదే కీలకం
  • నిఖిల్ ‘స్వయంభు’ విడుదల తేదీ ఖరారుకు VFX అవుట్‌పుట్‌పైనే ఆధారం!
  • ఏప్రిల్ 17న విడుదల చేయాలని చూస్తున్న మేకర్స్!
  • ఓటీటీ హక్కులు జీ5 దక్కించుకునే అవకాశం ఉందంటున్న సినీ వర్గాలు!
  • నిఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘స్వయంభు’!

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఇదిగో!

VFX పైనే ‘స్వయంభు’ భవితవ్యం!

నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సంయుక్తా మీనన్, నబా నటేష్ ఇందులో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మేకర్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా విడుదల తేదీపై స్పష్టమైన క్లారిటీ లేదు.

ఏప్రిల్ 17 విడుదల లక్ష్యంగా ప్లానింగ్!

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే విఎఫ్ఎక్స్ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత దానిని ఓటీటీ వారు చూడనున్నట్లు, చూసి వారికి అవుట్పుట్ నచ్చినట్లయితే వారు ఒక తేదీని నిర్ణయించనున్నట్లు, ఆ తేదీనే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమా యొక్క ఓటీటీ హక్కులను జీ5 సంస్థ దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల నుండి సమాచారం అందుతుంది.

జీ5 చేతికి ఓటీటీ హక్కులు?

ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో రూపొందుతుంది. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

నిఖిల్ ‘స్వయంభు’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.