|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పీఆర్ టీమ్ లపై తాప్సీ సంచలన కామెంట్స్! బాలీవుడ్ లో కొత్త వివాదం!

Published: 13-01-2026, 6:30 AM
పీఆర్ టీమ్ లపై తాప్సీ సంచలన కామెంట్స్! బాలీవుడ్ లో కొత్త వివాదం!
  • సౌత్ కంటే బాలీవుడ్ లో పీఆర్ టీమ్ ల హవా ఎక్కువైందని తాప్సీ వ్యాఖ్యానించారు.
  • ప్రస్తుతం పీఆర్ అంటే ఒకరిని పైకి లేపడమే కాకుండా ఇతరులను కిందికి లాగడం కూడా అని తాప్సీ అన్నారు.
  • సినిమాల ద్వారా నటనను నిరూపించుకుంటే సరిపోదు.. బలమైన వాయిస్ ఉండాలనే ట్రెండ్ పెరిగిందని తాప్సీ అన్నారు.
  • తనను పొగడడానికి సోషల్ మీడియా ఖాతాలకు డబ్బులు చెల్లించడానికి కూడా తన దగ్గర డబ్బులు లేదని తాప్సీ కుండబద్దలు కొట్టారు.

తాప్సీ పన్ను బాలీవుడ్ లోని పీఆర్ టీమ్ లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పీఆర్ టీమ్ లు కేవలం డబ్బు వృధా అని, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి.

పీఆర్ టీమ్ లపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు

Taapsee Pannu:ముఖ్యంగా ఒక హీరో లేదా ఒక హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చారు అంటే సినిమాల ద్వారానే వారు పాపులారిటీ సంపాదించుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి. ముఖ్యంగా సౌత్ తో పోల్చుకుంటే బాలీవుడ్ లో ఎక్కువగా సెలబ్రిటీలు తమను తాము పాపులర్ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చి మరీ పీఆర్ టీం ను నియమించుకుంటున్నారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పి.ఆర్ టీం పై ఊహించని కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది తాప్సీ. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె గత ఏడాదికి పైగా మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు కానీ వరుస ఇంటర్వ్యూలతో మాత్రం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఈమె చేసే కామెంట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీఆర్ టీం గురించి కామెంట్లు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది తాప్సీ. తాజాగా బాలీవుడ్ లో నడుస్తున్న పిఆర్ గేమ్ పై తాప్సీ అనుచిత వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ లో పీఆర్ గేమ్ పై తాప్సీ అసహనం

తాప్సీ మాట్లాడుతూ.. నేను నా పనులతో చాలా బిజీగా ఉన్నాను. అయితే గత రెండు సంవత్సరాలుగా నా పనుల వేగం తగ్గిపోయింది. ఇది నేను ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయమే. ముఖ్యంగా ఈ పిఆర్ గేమ్ మరో స్థాయికి వెళ్లిపోయిందని నేను గ్రహించాను. ఒకప్పుడు పి ఆర్ అంటే మన గురించి మంచిగా ప్రచారం చేయడం.. కానీ ఇప్పుడు పిఆర్ అంటే మనల్ని పైకి తీసుకెళ్లడమే కాకుండా ఇతరులను కిందికి లాగడానికి కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా మీ విజయం ఇంకొకరి వైఫల్యం పై ఆధార పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ ఘాటుగా ప్రశ్నించింది.

సినిమాల ద్వారా నటనను నిరూపించుకొని.. హిట్టు కొడితే సరిపోదు.. సినిమాలకు అతీతంగా బలమైన వాయిస్ ఉండాలనే ట్రెండ్ ఇప్పుడు పెరిగిపోయింది. అయితే బయట చూపించే ఆ వాయిస్ కి.. చేసేపనికి అసలు పొంతనే ఉండడం లేదు. నేను నా డబ్బును.. నాపై , నా కుటుంబం పై మాత్రమే ఖర్చు చేయాలని అనుకుంటున్నాను. నన్ను ప్రశంసిస్తూ వ్యాసాలు రాయడానికి.. నన్ను పొగడడానికి ఉపయోగించే సోషల్ మీడియా ఖాతాలకు 50 వేలు చెల్లించడానికి కూడా నా దగ్గర అంత డబ్బు లేదు” అంటూ స్పష్టంగా తెలిపింది తాప్సీ.

డబ్బు వృధా అంటున్న తాప్సీ

మొత్తానికైతే పీ ఆర్ టీమ్ ఒక దండగా అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. మనలో సత్తా ఉంటే మన గురించి ఎవరు గొప్పగా చెప్పకపోయినా.. మన సినిమాలే మన గురించి గొప్పగా చెబుతాయని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తాప్సీ చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు చాలామంది నెటిజన్లు ఈమె కామెంట్స్ కి మద్దతుగా నిలుస్తున్నారు. మనలో టాలెంట్ ఉంటే ఎదుటివాడే మన గురించి గొప్పగా ప్రశంసించాలి తప్ప ఇలా డబ్బులు ఇచ్చి మరీ మనల్ని పొగిడించుకోవాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు.

మొత్తానికి తాప్సీ పీఆర్ టీమ్ లపై చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె అభిప్రాయాలను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.