
ప్రముఖ నటి తాప్సీ పన్ను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా ఆత్మహత్యపై తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కలత చెందిన పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా ప్రభావం, వర్చువల్ ప్రేమపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Key Points
తాప్సీ పన్ను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా ఆత్మహత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఫాలోవర్స్, లైక్స్ కోసం జీవితాన్ని త్యాగం చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
వర్చువల్ ప్రేమ నిజ జీవిత ప్రేమను అడ్డుకుంటుందని తాప్సీ అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి తాప్సీ హెచ్చరించారు.
మిషా ఆత్మహత్యపై తాప్సీ స్పందన
స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి వీపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ రింగుల జుట్టు సుందరి స్టార్ హీరోల సరసన నటించి తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక గత ఏడాది ‘పిర్ ఆయి హసీన్ దిల్‌రూబా’(Pir Aai Haseen Dilruba) మూవీలో నటించి మెప్పించింది. ఇక తాప్సీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు సీక్రెట్‌గా తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఓ వైపు భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూనే వరుస సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే పలు పోస్టులు కూడా షేర్ చేస్తోంది. తాజాగా, తాప్సీ పన్ను ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది.
సోషల్ మీడియా ప్రభావం
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిషా(Misha) ఆత్మహత్య చేసుకోవడంపై స్పందించింది. ‘‘ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను చాలాకాలంగా భయపడుతూ వస్తున్నాను. జీవితాన్ని ప్రేమించడానికి బదులు సోషల్ మీడియాలో కనిపించే ఫాలోవర్స్, వచ్చే లైకుల సంఖ్య ప్రేమనుకుంటున్నారు. ఈ వర్చువల్ లవ్ నిజమైన ప్రేమను కంటికి కనపడకుండా చేస్తుందన్న భయం ఉండేది. ఇప్పుడదే నిజమైంది. లైక్స్, కామెంట్స్ చూసి తాత్కాలికంగా సంబరపడిపోతున్నారు. మీరు పొందిన డిగ్రీపట్టాలకన్నా కూడా మీకు వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి విలువైనవిగా పరిగణించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇలాంటివి చూస్తుంటే మనసు ముక్కలవుతోంది’’ అని రాసుకొచ్చింది.
వర్చువల్ ప్రేమ vs నిజ జీవిత ప్రేమ
కాగా, మిషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారని ప్రాణాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫాలోవర్ల కోసం డిప్రెషన్‌లోకి వెళ్లింది. అంతేకాకుండా అంతటితో తన కెరీర్ ముగిసినట్లు భావించి జీవితాన్నే కోల్పోయింది. అసలు టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి జనాలకు ఇన్‌స్టా ఓ మందులా పని చేస్తుందని చెప్పొచ్చు. అన్నం తినకుండా అయినా ఉంటారు కానీ రీల్స్ చేయకుండా.. చూడకుండా ఉండలేకపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. మరికొందరు రీల్స్ కోసం ప్రాణాలు కొల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ ఎన్నో జరిగిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా వ్యసనం ప్రమాదకరం అని తాప్సీ హెచ్చరిస్తూ, నిజ జీవిత ప్రేమ, సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక.


