
📌 Key Points
- తమన్నా ఒక సినిమాలో ఇంటిమేట్ సీన్ చేయడానికి నిరాకరించారు.
- దర్శకుడు తమన్నాను అందరి ముందు అవమానించాడు.
- తమన్నా ధైర్యంగా నిలబడి సన్నివేశాన్ని వ్యతిరేకించారు.
- చివరికి దర్శకుడు తమన్నాకు క్షమాపణలు చెప్పారు.
ప్రముఖ నటి తమన్నా భాటియా ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు తనను ఇంటిమేట్ సీన్ చేయమని ఒత్తిడి చేసిన సంఘటన గురించి వెల్లడించారు. ఆమె ఆ సీన్ చేయడానికి నిరాకరించినప్పటికీ, దర్శకుడు ఆమెను ఇబ్బంది పెట్టాడు.
తమన్నాకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి
Tamanna bhatia: తమన్నా పరిచయం అవసరం లేని పేరు .సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా సినిమాలలో వెబ్ సిరీస్ లలోను నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. కొత్త హీరోయిన్లకు పోటీగా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అదేవిధంగా స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా సినిమాలలో స్పెషల్ స్టెప్పులు వేయాలంటే ఒక పాటకు 6 కోట్లు ఇవ్వాల్సిందే. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటే తమన్నా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతుంది.
ఇక తమన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్టుల ద్వారా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా తమన్నాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా అన్న తర్వాత కథకు అనుగుణంగా కొన్ని సన్నివేశాలలో ఇష్టం లేక నటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇలా ఎంతోమంది చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలలో అయిష్టంగానే నటిస్తూ ఉంటారు.తమన్నాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని, ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. మరి తమన్నకు ఎదురైన పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే..
ఇంటిమేట్ సీన్ చేయడానికి నిరాకరణ
తమన్నా ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు తనని చాలా ఇబ్బంది పెట్టారని తెలియజేశారు. ఒక ఇంటిమేట్ సీన్ చేయడానికి తనకు ఏమాత్రం కంఫర్ట్ గా లేకపోవడంతో డైరెక్టర్ వద్దకు వెళ్లి నేను ఈ సీన్ చేయనని స్పష్టంగా చెప్పారట. ఈమె చేయనని చెప్పినప్పటికీ ఆ డైరెక్టర్ మాత్రం అందరి ముందు” ఫస్ట్ హీరోయిన్ ను మార్చండి” అన్నారట. అ సీన్ విషయంలో డైరెక్టర్ పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారని కానీ నేను మాత్రం ఎక్కడ తగ్గలేదని, ఏం జరిగినా ఎదుర్కొంటాను అంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నానని తమన్నా తెలియచేశారు.
క్షమాపణలు చెప్పిన డైరెక్టర్..
క్షమాపణ చెప్పిన దర్శకుడు
ఇలా డైరెక్టర్ కు వ్యతిరేకంగా తమన్న ఉంటూ ఆ సన్నివేశాన్ని చేయలేదట కానీ చివరికి ఆ డైరెక్టర్ తన వద్దకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పారని తమన్నా ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే తమన్నా నటించిన ఏ సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది? ఆ డైరెక్టర్ ఎవరు? ఏ హీరో సినిమా అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. తమన్నా తనకు జరిగిన ఈ అనుభవం గురించి తెలియజేయడంతో ఆ సినిమా ఏది అయ్యి ఉంటుందంటూ అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. ఇక తమన్నా కెరియర్ విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఇటీవల ఓదెల 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. వెండితెరపై చివరిగా తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
తమన్నా ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అభినందనీయం. ఈ సంఘటన సినిమా పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తు చేస్తుంది. తమన్నా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


