
తెలుగు సినీ నటి తమన్నా తన అద్భుతమైన ఫిట్‌నెస్‌కు కారణాలను వెల్లడించింది. ఉదయం 4:30 గంటలకు లేవడం, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ఆమె ఫిట్‌నెస్ మంత్రం అని తెలిపింది.
Key Points
తమన్నా ఉదయం 4:30కి లేచి వ్యాయామం చేస్తుంది.
ఆమె ఫిట్‌నెస్ కోసం క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తుంది.
బరువులు, యోగా, స్విమ్మింగ్, కార్డియో వ్యాయామాలు ఆమె రొటీన్లో భాగం.
ఆమె వర్కౌట్‌ను చాలా ఎంజాయ్ చేస్తుందని తెలిపింది.
తమన్నా ఫిట్‌నెస్ రహస్యం
బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా భాటియా తన పర్‌ఫెక్ట్ టోన్డ్ బాడీతో అద్భుతమైన ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తుంది. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తన ఫిగర్‌ను హాట్‌గా ఉంచడానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య, ఆరోగ్యకరమైన ఆహారం అని తెలిపింది.
10-12 సంవత్సరాలుగా తనకు తెలిసిన తన ఫిట్‌నెస్ కోచ్‌తో ఆగస్టు 23న జరిగిన ఇంటరాక్షన్‌లో ఫిట్‌నెస్ సీక్రెట్స్ బయటపెట్టింది తమన్నా భాటియా. తాను ఉదయం త్వరగా లేచే వ్యక్తిని అని వెల్లడించింది. అలాగే, తనను ప్రేరేపించే ఫిట్‌నెస్ మంత్ర రహస్యాలు పంచుకుంది ముద్దుగుమ్మ తమన్నా భాటియా.
తమన్నా భాటియా ఫిట్‌నెస్ మంత్ర గురించి మాట్లాడిన కోచ్ సిద్ధార్థ సింగ్ ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. “ఉదయం 4.30 గంటలకు లేచి వర్కౌట్ చేసుకుంటా. తర్వాత 12 గంటల షూటింగ్ షిఫ్ట్‌కు వెళ్తాను. నిలకడతో కూడిన సుస్థిరమైన ఫిట్‌నెస్‌ను ఉన్నత స్థాయిలో మెయింటేన్ చేస్తారు. నేను బిజీగా ఉన్నానని అనుకుంటున్నాను” అని తమన్నా తెలిపింది.
ఉదయం వ్యాయామం ప్రాముఖ్యత
ఆ వీడియోలో సిద్ధార్థ సింగ్ సరదాగా తమన్నాను ‘ట్రైనింగ్ కోసం 4.30 గంటలకు నిద్ర లేస్తావు, మరి రోజంతా నిద్రపోతావా?’ అని అడిగాడు. “లేదు, నేను రోజంతా పని చేస్తాను” అని తమన్నా నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అలాగే, తమన్నా తన బిజీ షెడ్యూల్‌ను 8 నుండి 12 గంటల మధ్య ఉంచుకుంటుందట.
“ఇంత త్వరగా లేవడానికి మిమ్మల్ని ప్రేరేపించే అంశాలు ఏంటీ” అని సిద్ధార్థ సింగ్ అడగ్గా.. “ఉదయం వ్యాయామం చేస్తే రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. రోజంతా బాగుంటుంది. వర్కౌట్‌కి ఇంకో మార్గం లేదు. నిజానికి డైట్ నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. కానీ, వ్యాయమానికి ఇంకో ప్రత్యమ్నాయం లేదు. నేను వర్కౌట్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను” అని తమన్నా తన ఫిట్‌నెస్ మంత్ర తెలిపింది.
తమన్నా డైట్ మరియు వ్యాయామం
ఇదిలా ఉంటే, గతంలో గతంలో హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా తన ఫిట్‌నెస్ డైలీ రొటీన్ వివరాలను పంచుకుంది. “నా ఫిట్‌నెస్‌లో భాగంగా బరువులు, యాబ్స్, క్రంచ్‌లు, కార్డియో, ఫ్రీ హ్యాండ్ వ్యాయామాలు చేస్తాను. ఉదయం పూట యోగా, స్విమ్మింగ్‌తో పాటు కనీసం గంట సేపు జిమ్‌లో గడుపుతాను. కొన్నిసార్లు పైలేట్స్, ఏరోబిక్స్ కూడా చేస్తాను” అని తమన్నా చెప్పుకొచ్చింది.
కాగా, రీసెంట్‌గా తెలుగులో తమన్నా ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, అది అంతగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అమెజాన్ ప్రైమ్‌లో ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తమన్నా ఫిట్‌నెస్‌కు క్రమశిక్షణ, నిలకడ అతి ముఖ్యమని చెప్పింది. ఉదయం వ్యాయామం ఆమెకు చాలా ఇష్టమని, దానివల్ల రోజంతా చురుకుగా ఉంటుందని తెలిపింది.


