|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్.. సెన్సేషనల్ పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమన్నా

Published: 28-06-2025, 3:41 AM
దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్.. సెన్సేషనల్ పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమన్నా

టాలీవుడ్‌లో తమన్నా భాటియా వరుస సినిమాలతో బిజీగా ఉంది. కొంతకాలం విజయ్ వర్మతో డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ వర్మ ఫాతిమా సనా షేక్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తమన్నా తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఈ వార్తలను మరింత రసవత్తరంగా మార్చింది.

Key Points

1

తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ వార్తల తర్వాత వారి విరామం గురించి వార్తలు

2

విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ డేటింగ్ పుకార్లు వైరల్ అవుతున్నాయి

4

తమన్నా పోస్ట్ విజయ్ వర్మతో బ్రేకప్ గురించి సూచించేలా ఉందని అభిప్రాయాలు

తమన్నా-విజయ్ వర్మ డేటింగ్ రూమర్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ చిందులేస్తున్న ఈ భామ భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తమన్నా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె కొద్దికాలంపాటు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Verma)తో డేటింగ్ చేసింది. ఇక వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే క్రమంలో బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు ఓ ఈవెంట్‌లో కనిపించడంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది. అయితే గత కొద్ది రోజులనుంచి విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌(Fatima Sana Sheikh)తో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె క్లోజ్‌గా ఉన్న వీడియో వైరల్ కావడంతో అంతా తమన్నాతో బ్రేకప్ అయినట్లు ఫిక్స్ అయిపోయారు.

అయితే ఫాతిమా, విజయ్ నిత్యం పలు చోట్లకు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, తమన్నా ఇన్‌స్టా ద్వారా షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె నమ్మకం మీద ఆ పోస్ట్ పెట్టడంతో విజయ్ వర్మ గురించి అని అంతా అభిప్రాయపడుతున్నారు. అసలు అందులో ఏముందంటే.. ‘‘కొన్ని డిజైన్‌లలో తెలుపు రంగు ఎక్కువగా కనిపించవచ్చు. అలా అని దాన్ని తప్పుపటొద్దు. దాని వెనకా వేరే కారణం ఉండొచ్చు. అన్ని సార్లు మనం అనుకున్నవి అన్నీ జరగకపోవచ్చు. అయినప్పటికీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతి అంగుళం మనం పూర్తి చేయకపోవడం కూడా నిజమైన విశ్వాసమే అవుతుంది’’ అని రాసి ఉన్న కొటేషన్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన వారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఫాతిమా సనా షేక్ తో విజయ్ వర్మ

తమన్నా ఇన్‌స్టా పోస్ట్ వైరల్

తమన్నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ పోస్ట్ విజయ్ వర్మతో బ్రేకప్ గురించి సూచిస్తుందని అభిమానులు అంటున్నారు. ఈ డేటింగ్ రూమర్స్ చివరికి ఏమవుతాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.