
📌 Key Points
- తమన్నా కెరీర్ ఆరంభం ‘శ్రీ’ సినిమాతో, ‘హ్యాపీడేస్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
- విజయ్ వర్మతో తమన్నా ప్రేమ వ్యవహారం కొన్నాళ్లకే ముగిసింది.
- ఐటెం సాంగ్స్ విషయంలో తమన్నా నిర్ణయాలు మారుతుండటం గమనించవచ్చునని నెటిజన్లు అంటున్నారు.
- తనని తాను అర్థం చేసుకోలేకపోతున్నానని తమన్నా వ్యాఖ్యానించారు.
ప్రముఖ నటి తమన్నా ప్రస్తుతం తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాల పట్ల గందరగోళానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఐటెం సాంగ్స్ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటో చూద్దాం.
తమన్నా సినీ ప్రస్థానం
Tamannaah: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ గా, మిల్కీ బ్యూటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తమన్నా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. హ్యాపీడేస్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బద్రీనాథ్, రచ్చ, రెబల్, ఊసరవెల్లి అంటూ పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. తన అందచందాలతో హావ భావాలతో గత రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
36 సంవత్సరాల వయసులో కూడా కథానాయికగా వరుస అవకాశాలు అందుకుంటూ ఉండటం మరో విశేషం. అలాగే ఐటెం సాంగ్స్ లో కూడా యువతను తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో గిలిగింతలు పెడుతోంది. ఒక ఐటమ్ సాంగ్ కి సుమారుగా 5 నుండి 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తో ఒక సినిమా చేస్తోంది . సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్లో రెండు బడా ప్రాజెక్టులలో కూడా లీడ్రోల్ పోషించడానికి సిద్ధం అయ్యింది.
విజయ్ వర్మతో ప్రేమాయణం – ముగింపు
అలా ఒకవైపు కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె మొన్నామధ్య ప్రేమ వ్యవహారంలో చిక్కుకొని వార్తల్లో నిలిచింది .ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చట్టా పట్టాలేసుకొని తిరిగింది.ఈ జంటను చూసి పెళ్లి చేసుకుంటారు అనుకునే లోపే.. ఈ ముచ్చట కాస్త మూన్నాళ్ళకే ముగియడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉండగా ఇటీవల ఐటమ్ సాంగ్స్ లో నటించను అని చెప్పిన ఈమె.. ఇప్పుడు మళ్లీ ప్రముఖ హీరోల చిత్రాలలో అలాంటి పాటల్లో నటించడానికి సిద్ధమే అని చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తమన్న లైఫ్ లో తను తీసుకున్న నిర్ణయాలనే పలుమార్లు మార్చుకుంటూ వెళ్తోందా అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
పైగా దీనిపై ట్రోల్స్ కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవల ఒక కార్యక్రమంలో ఇలాంటి ప్రశ్న తమన్నాకు ఎదురవడంతో.. ఆమె ఊహించని కామెంట్లు చేసింది. తమన్నా మాట్లాడుతూ..” నన్ను నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను.. ఇతరులను ఎలా అర్థం చేసుకోగలను” అంటూ కామెంట్లు చేసింది. మొత్తానికైతే కన్ఫ్యూజన్లో పడ్డాను అని చెప్పిన ఈ అమ్మడు ఎందుకిలా ప్రవర్తిస్తుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈమె మాటలు విన్న కొంతమంది నెటిజన్స్ యోగా చేయాలి అని , మనసుపై ధ్యాస పెట్టి నిర్ణయాలను ప్రశాంతంగా తీసుకోవాలని సలహాలిస్తున్నారు . మొత్తానికైతే తమన్నా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఐటెం సాంగ్స్ పై యూటర్న్
మొత్తానికి తమన్నా తన నిర్ణయాల పట్ల అయోమయంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ గందరగోళానికి గల కారణాలు మాత్రం ఆమె వెల్లడించలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.


