|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమన్నాకు ‘బాహుబలి’లో డూప్ గా.. మొదట చేయను అన్నా.. నా యాటిట్యూడ్ చూసి..

Published: 17-06-2025, 7:18 AM
తమన్నాకు ‘బాహుబలి’లో డూప్ గా.. మొదట చేయను అన్నా.. నా యాటిట్యూడ్ చూసి..

బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ తాజా ఇంటర్వ్యూలో బాహుబలి సినిమాలో తమన్నాకు డూప్ గా నటించిన విషయాన్ని వెల్లడించింది. ఆమె మొదట ఆ అవకాశాన్ని తిరస్కరించిన విధానం మరియు తర్వాత ఆమె నటనను తమన్నా గుర్తించడం గురించి ఆమె వివరించింది.

Key Points

1

భానుశ్రీ బాహుబలిలో తమన్నాకు డూప్ గా నటించింది.

2

మొదట ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించింది.

4

తమన్నా ఆమె యాటిట్యూడ్, నటన చూసి మరో పాత్ర ఇచ్చింది.

భానుశ్రీ బాహుబలి అనుభవం

Tamannaah : మన హీరోలకు, హీరోయిన్స్ కి డూప్ లు ఉంటారని తెలిసిందే. చాలామంది స్టార్స్ యాక్షన్ సీన్స్, ఫేస్ కనిపించకుండా ఉండే షాట్స్, సజెషన్ షాట్స్ లో చాలా వరకు డూప్స్ ని వాడతారు. డూప్ లు కొంతమంది బయటి వాళ్ళే ఉంటే కొంతమంది సినీ పరిశ్రమ వాళ్ళు కూడా ఉంటారు. కొంత మంది నటీనటులు స్టార్ హీరో హీరోయిన్స్ కి డూప్ గా కూడా చేస్తారు.

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ బాహుబలి సినిమాలో తమన్నాకు డూప్ గా చేసాను అని తెలిపింది. అయితే బాహుబలి సినిమాలో తమన్నా ఫ్రెండ్స్ లో ఒక క్యారెక్టర్ కూడా చేసింది భానుశ్రీ. ఆ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

డూప్ గా నటించడం

తమన్నా ప్రతిస్పందన

భానుశ్రీ మాట్లాడుతూ.. నేను డ్యాన్సర్ గా చేస్తున్నప్పుడు తమన్నాకు డూప్ గా చేయమని ఛాన్స్ వచ్చింది. అది బాహుబలి సినిమా అని నాకు తెలీదు. మొదట చేయను అన్నాను. తర్వాత వాళ్ళు రెమ్యునరేషన్ బాగా ఇస్తామని చెప్పడంతో ఓకే చెప్పాను. సెట్ కి వెళ్ళాక అది బాహుబలి సినిమా అని తెలిసింది. 17 రోజులు తమన్నాకు డూప్ గా నటించాను. ఆ తర్వాత నా యాటిట్యూడ్, యాక్టింగ్ చూసి తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ కి తీసుకున్నారు వాళ్ళే అని తెలిపింది.

భానుశ్రీ యొక్క బాహుబలి అనుభవం ఆసక్తికరంగా ఉంది. ఆమె నటనను తమన్నా గుర్తించి మరో అవకాశం ఇవ్వడం ఆమెకు గొప్ప అనుభవం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.