|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దీపికా పదుకొణెకు సపోర్టుగా తమన్నా.. నెటిజన్ల రచ్చ

Published: 28-05-2025, 11:14 PM
దీపికా పదుకొణెకు సపోర్టుగా తమన్నా.. నెటిజన్ల రచ్చ

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్‌తో దీపికా పదుకొణె పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెకు తమన్నా సపోర్ట్ చేసిందని నెటిజన్లు అనుకున్నారు. కానీ తమన్నా అది తప్పు అని చెప్పింది.

Key Points

1

దీపికా పదుకొణె పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

2

సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్‌కు దీపికా స్పందించింది.

4

తమన్నా లైక్ చేయలేదని, వార్తలు తప్పు అని స్పష్టీకరించింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన దీపికా

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తాజాగా చేసిన ట్వీట్‌తో రెండు రోజులుగా దీపికా పదుకొణె( Deepika Padukone) పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తను తీయబోతున్న సినిమా కథను ఒక స్టార్‌ హీరోయిన్‌ లీక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ  సోషల్‌మీడియాలో ఆయనొక పోస్ట్‌ చేశారు. సందీప్‌ చేసిన కామెంట్స్‌ దీపికను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సందీప్ రెడ్డి వంగా ట్వీట్‌కు స్పందన

సందీప్‌ కామెంట్‌ చేసిన కొన్ని గంటల్లోనే దీపిక కూడా పరోక్షంగా స్పందించింది. ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  ‘జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను’ అని చెప్పుకొచ్చింది.

తమన్నా వివరణ

ఆ వీడియోను ఆమె తన స్టోరీస్‌లో షేర్‌ చేస్తూ.. అగౌరవం, పురుషులు, లింగ వివక్షత, లింగ వేతన వ్యత్యాసం, ఓవర్ టైం పని, వృత్తి నైపుణ్యం లేకపోవడం, స్త్రీ ద్వేషం, ద్వంద్వ ప్రమాణాలు ట్యాగ్‌ లైన్‌తో ఒక వీడియో షేర్‌ చేశారు. దానిని తమన్నా లైక్‌ చేశారని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. అది కాస్త నెట్టింట వైరల్‌ అయిపోయింది. దీపికాకు తమన్నా సపోర్ట్‌ చేస్తుందంటూ పేర్కొన్నారు. అయితే, తాజాగా  తమన్నా వివరణ ఇచ్చింది. తాను ఎవరి పోస్ట్‌కు లైక్‌ కొట్టలేదని తెలిపింది. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు క్రియేట్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. లైక్‌ కొట్టలేదని ఇన్‌స్టాగ్రామ్‌ చెప్పినా నమ్మలేని స్థితిలో కొందరు ఉన్నారని పేర్కొంది. దయచేసి దీనిని ఇంతటితో వదిలేయండి చాలా పనులు ఉన్నాయంటూ  ఆమె వెళ్లిపోయింది.

చివరకు తమన్నా తాను ఎలాంటి సపోర్ట్ చేయలేదని స్పష్టం చేసింది. ఈ వివాదం ఇంతటితో ముగిసిందని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.