|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tamannaah: వాళ్లతో ఒక్కసారి కనిపిస్తే పెళ్లి చేసేశారు: తమన్నా

Published: 03-08-2025, 9:45 AM
Tamannaah: వాళ్లతో ఒక్కసారి కనిపిస్తే పెళ్లి చేసేశారు: తమన్నా

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన తమన్నా, తాజా ఇంటర్వ్యూలో తనపై వచ్చిన పెళ్లి రూమర్ల గురించి మాట్లాడింది. అబ్దుల్ రజాక్ మరియు విరాట్ కోహ్లీతో తనకున్న సంబంధంపై ఆమె స్పష్టతనిచ్చింది.

Key Points

1

తమన్నా తనపై వచ్చిన పెళ్లి రూమర్స్ గురించి స్పందించింది.

2

అబ్దుల్ రజాక్ తో కలిసి ఫోటో దిగడంతో పెళ్లి వార్తలు వచ్చాయని తెలిపింది.

4

ఇలాంటి వార్తలు చాలా ఇబ్బందికరంగా, బాధగా అనిపిస్తాయని పేర్కొంది.

పెళ్లి రూమర్స్‌పై తమన్నా స్పందన

మిల్కీ బ్యూటీ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా . తెలుగులో దాదాపు స్టార్ ‌ హీరోల అందరి సరసన నటించింది . టాలీవుడ్ ‌ లో స్టార్ హీరోయిన్ ‌ గా రాణించిన ముద్దుగుమ్మ .. ప్రస్తుతం పెద్దగా కనిపించట్లేదు . ఈ ఏడాదిలో ఓదెల -2 మూవీతో అభిమానులను పలకరించింది . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది . ప్రస్తుతం బాలీవుడ్ ‌ లో బిజీగా ఉన్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది . ఈ సందర్భంగా తనపై వచ్చిన రూమర్స్ ‌ పై క్లారిటీ ఇచ్చింది .

గతంలో పాక్ క్రికెటర్ ‌ అబ్దుల్ రజాక్ ‌ తో తమన్నా పెళ్లి అంటూ వచ్చిన కథనాలపై స్పందించింది . ఇలాంటి వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయని గుర్తు చేసుకుంది . ఓ ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవంలో అబ్దుల్ రజాక్‌తో కలిసి ఫోటో దిగడంతో ఇలాంటి రూమర్స్ వచ్చాయని తెలిపింది . తనకు కేవలం అబ్దుల్ రజాక్ ‌ తో మాత్రమే కాదు .. విరాట్ కోహ్లీతోనూ తనకు ముడిపెట్టారని వివరించింది . నా జీవితంలో విరాట్ ‌ ను కేవలం ఒక్కసారి మాత్రమే కలిశానని తమన్నా వెల్లడించింది . ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా , బాధగా అనిపిస్తుందని పేర్కొంది . ఇలాంటి వాటిని మరిచిపోవడానికి కాస్తా సమయం పడుతుందని తెలిపింది .

అబ్దుల్ రజాక్‌తో తమన్నా సంబంధం?

విరాట్ కోహ్లీతోనూ రూమర్లు?

తమన్నా ఈ రూమర్ల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను, అవి తనకు ఎంత బాధ కలిగించాయో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ వార్తలు ఎంతో కాలం ఆమెను వేధించాయని తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.