|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమిళ బోల్డ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా వచ్చేస్తోంది.. లిప్ లాక్స్, టాప్‌లెస్ సీన్లతో.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published: 10-09-2025, 5:41 AM
తమిళ బోల్డ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా వచ్చేస్తోంది.. లిప్ లాక్స్, టాప్‌లెస్ సీన్లతో.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఆహా తమిళం ఓటీటీలో ప్రేక్షకులను అలరించిన బోల్డ్ వెబ్ సిరీస్ ‘Shh…’ రెండో సీజన్ త్వరలో రానుంది. తొలి సీజన్ విజయం తర్వాత, రెండో సీజన్ మరింత ఆసక్తికరమైన కథలతో, లిప్ లాక్స్ మరియు టాప్ లెస్ సీన్లతో ప్రేక్షకులను అలరించనుంది.

Key Points

1

తమిళ బోల్డ్ వెబ్ సిరీస్ 'Shh…' రెండో సీజన్ త్వరలో రానుంది.

2

లిప్ లాక్స్, టాప్‌లెస్ సీన్లతో సిరీస్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది.

4

నాలుగు వేర్వేరు కథలతో ఆకట్టుకునే ఈ ఆంథాలజీ సిరీస్ రెండో సీజన్‌కు ఎదురుచూస్తున్నారు.

‘Shh…’ సిరీస్ రెండో సీజన్ విడుదల

తమిళ బోల్డ్ వెబ్ సిరీస్ ష్… (Sshhh..). నాలుగు వేర్వేరు కథల ఈ ఆంథాలజీ సిరీస్ గతేడాది ఏప్రిల్ 29న ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. ఈ ఏడాది తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడీ ఆంథాలజీ రెండో సీజన్ రానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. ప్రతి రోజూ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని చెబుతూ వస్తోంది.

తమిళ బోల్డ్ ఆంథాలజీ సిరీస్ నాలుగు ఎపిసోడ్లతో తొలి సీజన్ రాగా.. త్వరలోనే రెండో సీజన్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తమిళం ఓటీటీ వెల్లడించింది. తొలి సీజన్లో నాలుగు ఎపిసోడ్లు ప్రేమ, కామం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగాయి. ఇప్పుడు రెండో సీజన్ మరింత ఆసక్తి రేపుతోంది.

మార్నింగ్ అప్డేట్ ఫ్రెండ్స్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ఘాటు లిప్ లాక్ లో ఓ జంట మునిగిపోవడం చూడొచ్చు. తొలి సీజన్ లాగే ఈ రెండో సీజన్ కూడా ఇలాంటి సీన్లతో నిండిపోనున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ రెండో సీజన్ ను కూడా తెలుగులో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

బోల్డ్ కంటెంట్‌తో ఆకట్టుకునే సీన్లు

గతేడాది తమిళం లో ష్… పేరుతో ఈ బోల్డ్ ఆంథాలజీ సిరీస్ వచ్చింది. ఈ ఏడాది దానిని తెలుగులోకి డబ్ చేశారు. నాలుగు వేర్వేరు కథల సమాహారంగా ఈ సిరీస్ వచ్చింది. ఇందులో ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయికి ఓ స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాల్సిన ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అయితే పిల్లలకు అన్ని సబ్జెక్టులతోపాటు సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఎంత ముఖ్యమన్నది దీనిద్వారా చెప్పే ప్రయత్నం మేకర్స్ చేశారు. సెక్స్ ఎడ్యుకేషన్ ఆప్షనల్ కాదు.. తప్పనిసరి అని సందేశం ఇచ్చే ఎపిసోడ్ ఇది.

ఇక ఈ ఆంథాలజీ సిరీస్ లోనే మరో మూడు ఎపిసోడ్లు ఉన్నాయి. రెండో ఎపిసోడ్లో ఇద్దరు ఎక్స్ లవర్స్ చుట్టూ తిరిగే స్టోరీని చూపించారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని భర్తతో ఇష్టం లేని కాపురం చేస్తూ.. పడక గది సుఖానికి దూరమైన అమ్మాయి.. తన మాజీ లవర్ ను కలిసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇందులో చూడొచ్చు.

తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్

మూడో ఎపిసోడ్ 38 ఏళ్ల మహిళ చుట్టూ తిరిగే కథ. ఓ ఆర్మీ అధికారిని ఆమె పెళ్లి చేసుకుంటుంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఓ ఆపరేషన్ కోసం వెళ్లి ఆ అధికారి కనిపించకుండా పోతాడు. ఎన్నో రోజుల పాటు అతడు తిరిగి వస్తాడని ఆమె ఎదురు చూస్తుంది. ఆ తర్వాత తన పాత ఫేస్‌బుక్ ఫ్రెండ్ తో మళ్లీ చనువు పెరుగుతుంది. వాళ్లు కలుద్దామనుకునే సమయానికి ఓ ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది.

నాలుగో ఎపిసోడ్ విషయానికి వస్తే.. శక్తివేల్ అనే ఓ 20 ఏళ్ల ఐఏఎస్ ఆస్పిరెంట్ చుట్టూ తిరిగే స్టోరీ. ఓవైపు సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతూనే.. ఓ అమ్మాయి పట్ల విపరీతంగా ఆకర్షితుడవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అతడు తన లక్ష్యాన్ని చేరుకుంటాడా లేక తన కోరికలకు బలవుతాడా అన్నది ఇందులో చూడొచ్చు.

తమిళంలో విజయవంతమైన ‘Shh…’ వెబ్ సిరీస్ రెండో సీజన్ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది. లిప్ లాక్స్ మరియు టాప్ లెస్ సీన్లతో మరింత ఆసక్తికరంగా ఉండనున్న ఈ సిరీస్‌కు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.