
తమిళంలో సంచలన విజయం సాధించిన ‘డీఎన్ఏ’ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. పుట్టిన వెంటనే పసిపాప మాయమవడం, ఓ రోడ్డు ప్రమాదం.. ఇవన్నీ ఈ సినిమా కథలో భాగం.
Key Points
ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న తమిళ థ్రిల్లర్ 'డీఎన్ఏ'.
పసిపాప మాయమవడం, యాక్సిడెంట్‌తో ఉన్న సంబంధం.
అథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో.
డీఎన్ఏ సినిమా కథాంశం
ఓటీటీలో తమిళ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ (DNA) దూసుకెళ్తోంది. పసి పాపల అక్రమ రవాణా కథాంశంగా సాగే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ తమిళ మూవీ గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో, ట్విస్ట్ లతో ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. అయితే తెలుగులో థియేటర్లలో రిలీజైన ఒక్క రోజులోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం.
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన డీఎన్ఏ తెలుగులో మై బేబీ టైటిల్ తో రిలీజ్ అయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జులై 18న తెలుగులో రిలీజైంది. ఆ తర్వాతి రోజు అంటే జులై 19న ఓటీటీ లోకి వచ్చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మై బేబీ సినిమాలో అధర్వ మురళి, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటించారు. డీఎన్ఏకు నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు.
థియేటర్ నుంచి ఓటీటీకి వేగవంతమైన మార్పు
డీఎన్ఏ సినిమా తమిళంలో జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. అక్కడ సినిమాకు అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డీఎన్ఏ తమిళంలో రూ. 7.36 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలో అదరగొడుతోంది. ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ కు ఓటీటీ ప్రేక్షకులు జై కొడుతున్నారు.
తమిళ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏలో అథర్వ, నిమిషా సజయన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ పసి బిడ్డల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది. ముందుగా కథ 2014లో జరిగే ఓ యాక్సిడెంట్ తో మొదలవుతుంది. వరదరాజన్ (జీషాన్ అయ్యుబ్) అనే ఓ సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్ నిద్ర మత్తులో కారు నడుపుతూ ఓ బైకును వెనుక నుంచి ఢీకొడతాడు. ఇందులో భార్యాభర్తలు ఇద్దరూ కన్నుమూయగా.. వాళ్ల రోజుల పసిబిడ్డను రోడ్డు పక్కన గమనించిన అతడు.. హాస్పిటల్లో తన బిడ్డను కోల్పోయిన వారికి ఇస్తాడు. సీన్ అక్కడ కట్ చేస్తే 2023కు కథ చేరుతుంది.
ప్రేక్షకుల స్పందన
ఆనంద్ (అథర్వ), దివ్య (నిమిషా) భార్యభర్తలు. వాళ్లకు ఓ బాబు పుడతాడు. అయితే పుట్టిన తర్వాత నిమిషాల వ్యవధిలోనే వాళ్ల బాబు మారిపోతాడు. ఆ విషయాన్ని దివ్య మాత్రమే గుర్తిస్తుంది. ఆమెకు పెళ్లికి ముందు బైపోలార్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ) ఉండటంతో ఆమె మాటలు ఎవరూ నమ్మరు.
హాస్పిటల్ వాళ్లు కూడా ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేస్తారు. తన భార్య మాటల వెనుక నిజం తెలుసుకోవడానికి ఆనంద్ డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఆ బిడ్డ తమవాడు కాదని తేలుతుంది. దీంతో అతడు కోర్టును ఆశ్రయిస్తాడు. మరోవైపు పోలీసులతో కలిసి తానే స్వయంగా అసలు ఏం జరిగిందో కనిపెట్టే పని మొదలుపెడతాడు. ఈ క్రమంలో పుట్టిన బిడ్డలను మాయం చేసే పెద్ద మాఫియా చెయిన్ వాళ్లకు ఎదురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆనంద్, దివ్యలకు తమ కొడుకు మళ్లీ దొరుకుతాడా లేదా? వాళ్ల కొడుకు స్థానంలో వేరొకరిని మార్చడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అన్నది ఈ డీఎన్ఏ సినిమాలో చూడొచ్చు.
చివరగా, డీఎన్ఏ సినిమా ఓటీటీలో అద్భుతమైన విజయం సాధిస్తోంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఆస్వాదిస్తున్నారు.


