
📌 Key Points
- తమిళనాడులో ఎన్నికల నగారా మోగించనున్న ఎన్నికల కమిషన్.
- విజయ్ పార్టీతో పొత్తు కోసం బీజేపీ ఆఫర్: 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి.
- విజయ్ సీఎం పదవిపై దృష్టి సారించినట్లు సమాచారం.
- కాంగ్రెస్ కూడా విజయ్ పార్టీతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోంది.
తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా పొత్తు కోసం ఎదురుచూస్తోంది.
తమిళనాడులో ఎన్నికల సమరం
దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సారి ఇక్కడ పాగా వేయాలని బీజేపీ (BJP) ప్లాన్ చేస్తుంటే అధికారం కాపాడుకునేందుకు డీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీవీకే విజయ్ (Thalapathy Vijay) పార్టీ పొత్తుల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని టీవీకే చీఫ్ విజయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా ఉహాగానాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా టీవీకే (TVK Party) విజయ్‍కు బీజేపీ బంపరాఫ్ ఇచ్చినట్లు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీవీకేతో పొత్తుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని పొత్తు కుదిరితే టీవీకేకు 80 సీట్లు, విజయ్‍కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే విజయ్ మాత్రం సీఎం పదవి పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం బీజేపీతో పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేసినా ప్రచారం ఆగకపోవడంతో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సైతం విజయ్ పార్టీతో పొత్తుకు చూస్తోందనే చర్చ జరుగుతోంది.
విజయ్‌కు బీజేపీ ఆఫర్
కాంగ్రెస్ ప్రయత్నాలు
మొత్తానికి, తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. విజయ్ నిర్ణయం కీలకం కానుంది. బీజేపీ ఆఫర్‌ను ఆయన అంగీకరిస్తారా లేదా వేచి చూడాలి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.


