|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మరో జన్మలో ఆయనలా పుట్టాలనుకుంటా: పవన్‌ సాయితో బంధంపై తనూజ సంచలన వ్యాఖ్యలు!

Published: 03-01-2026, 7:00 AM
మరో జన్మలో ఆయనలా పుట్టాలనుకుంటా: పవన్‌ సాయితో బంధంపై తనూజ సంచలన వ్యాఖ్యలు!
  • బిగ్‌ బాస్‌ తెలుగు 9తో తనూజ పాపులర్ అయ్యారు, రన్నరప్‌గా నిలిచారు.
  • నటుడు పవన్‌ సాయితో తన రిలేషన్‌పై తనూజ తాజాగా స్పందించారు.
  • తన కుటుంబం తర్వాత పవన్‌ సాయే తనకు ముఖ్యమైన వ్యక్తి అని తనూజ వెల్లడించారు.
  • మరో జన్మలో ఆయనలా పుట్టాలనుకుంటానని తనూజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 9తో ప్రేక్షకులకు దగ్గరైన తనూజ.. నటుడు పవన్‌ సాయితో తన బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబం తర్వాత ఆయనే తనకు అన్నింటికంటే ముఖ్యమని, మరో జన్మ ఉంటే ఆయనలా పుట్టాలనుకుంటానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రత్యేక బంధం గురించి మరింత తెలుసుకుందాం.

తమరిద్దరి బంధంపై తనూజ స్పందన

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోతో పాపులర్‌ అయ్యింది తనూజ. సీరియల్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇటీవల బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రారంభం నుంచి తనదైన గేమ్‌తో ఆకట్టుకుంటూ వచ్చింది. అందరిలో కెళ్ల కాస్త మెచ్యూరిటీగా ఉంటూ మెప్పించింది. అదే సమయంలో టాస్క్ ల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంది. ఇమ్మాన్యుయెల్‌తో కలిసి బాగా ఎంటర్‌టైన్‌ చేసింది. మరోవైపు భరణిని నాన్న అని పిలుస్తూ సెంటిమెంట్‌ని పలికించింది. మొత్తంగా కప్‌ గెలుచుకునేందుకు చివరి అంచు వరకు వెళ్లింది. రన్నరప్‌గా మిగిలిపోయింది.

అయితే బిగ్‌ బాస్‌ షోలో ఆమె కళ్యాణ్‌ పడాల విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్‌ చూపించింది. ఆయనపై తెలియని ఇంట్రెస్ట్ ని చూపించింది. కళ్యాణ్‌ కూడా ఆమె విషయంలో ఇంట్రెస్ట్ గా కనిపించాడు. ఛాన్స్ దొరికితే పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. అంతేకాదు షో అయిపోయాక తన గెలుపు క్రెడిట్‌ తనూజకే ఇచ్చాడు. ఆమె వల్లే తాను ధైర్యంగా ఉండగలిగాను, చాలా మారగలిగాను అని తెలిపాడు. అయితే షోలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య క్రష్‌ నడిచిందనే టాక్‌ వచ్చింది. ఆ తర్వాత కూడా వీరి మధ్య ఇంకా ఏదో ఉందనే విషయం చర్చనీయాంశమైంది. కానీ మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని ఈ ఇద్దరు బయటకు ప్రొజెక్ట్ చేశారు.

కుటుంబంలో పవన్‌ సాయి స్థానం

ఈ క్రమంలో ఇప్పుడు తనూజకి సంబంధించిన మరో విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. నటుడు పవన్‌ సాయితో తనూజ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. తనూజ, సాయి కలిసి `ముద్దమందారం` సీరియల్‌లో నటించారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. రియల్‌ కపుల్ అనేంతగా ఈ ఇద్దరు తమ బాండింగ్‌ని చూపించారు. దీంతో వీరి మధ్య ఉన్న రిలేషన్‌పై పలు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తనూజ దీనిపై స్పందించింది. తమ రిలేషన్‌ ఎలాంటిదో తెలిపింది. తన ఫ్యామిలీ తర్వాత ఇంపార్టెంట్‌ పర్సన్‌ అంటే పవన్ అని చెప్పింది.

తనూజ మాట్లాడుతూ, తనని తన ఫ్యామిలీ తర్వాత అంతగా పట్టించుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ సాయి అని, వ్యక్తిగత విషయాల్లోనే కాదు, ప్రొఫెషనల్‌ విషయాల్లోనూ ఆయన ప్రమేయం ఉంటుందని చెప్పింది తనూజ. తనకు ఏదైనా ఆఫర్‌ వస్తే, అది చేయాలా? వద్దా అనేది ఫ్యామిలీతో మాట్లాడుతుంటే, ఒకసారి పవన్‌కి ఫోన్‌ చేయు అని అమ్మ చెబుతుంది. అమ్మమ్మ కూడా పవన్‌ని అడుగు, ఏమంటాడో కనుక్కో అని చెబుతుంది. అంతగా తన ఫ్యామిలీలో పవన్‌ కలిసిపోయాడని చెప్పింది తనూజ. ఏదైనా డిస్కస్‌ చేయాలంటే ఫస్ట్ పర్సన్‌ సాయినే అని స్పష్టం చేసింది.

కళ్యాణ్‌ పడాలతో క్రష్‌ రూమర్స్‌

“పవన్ లాంటి వ్యక్తిని మనం చాలా రేర్‌గా చూస్తాం, పవన్ తో నేను తమిళ్‌లో, తెలుగులో కూడా కలిసి వర్క్ చేశాను. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చాలా రేర్‌గా ఉంటారు. ఎంత సీరియస్ సందర్భం అయినా స్మైల్‌తోనే మ్యానేజ్ చేస్తారు. చాలా కూల్ పర్సన్. పిడుగు వచ్చి మీద పడ్డా కూడా కూల్‌గా ఉంటారు. టెన్షన్ పడుతుంటే రిలాక్స్ అని కూల్ చేసేస్తుంటారు. చాలా పాజిటివ్ పర్సన్. చాలా బాగా మోటివేట్ చేస్తారు. ప్రతి విషయాన్ని ఎంత కూల్‌గా చెప్తారంటే.. మనకి కోపం వస్తే మన ఎక్స్ ప్రెషన్ మారిపోతుంది. బిహేవియర్ మారిపోతుంది. కానీ ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఆనందం అయినా బాధ మొహంపై చిరునవ్వు చెరిగిపోదు. నేను ఆయన్ని చాలాసార్లు అడిగాను. మీరు ఇంత కూల్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అని. దానికి ఆయన `జరిగేది జరుగుతుంటుంది, దానికోసం వర్రీ ఎందుకు` అని అంటారు. ఎవరి గురించి నెగటివ్‌ గా మాట్లాడరు, ఎవరినీ బాధపెట్టరు. అలాంటి వ్యక్తిని భవిష్యత్‌లో కలుస్తానో లేదో తెలియదు, ఇంకో జన్మ అనేది ఉంటే అలాంటి మెంటాలిటీ, అలాంటి యాటిట్యూడ్‌తో పుట్టాలని కోరుకుంటా` అని తెలిపింది తనూజ.

పెళ్లి గురించి తనూజ ఓపెన్‌ అయ్యింది. ఆమె చెబుతూ, తన లైఫ్‌లో ఫేవరేట్‌ చాప్టర్‌ ఏదైనా ఉందంటే అది పెళ్లినే అని, తనకు పెళ్లి అంటే చాలా ఇష్టమని, ఆ క్షణం కోసం తానూ ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ సందర్భంగా  అబ్బాయిల విషయంలో తన అమ్మమ్మ చెప్పిన విషయాన్ని పంచుకుంటూ, `ఒక అబ్బాయి చెడిపోవడానికైనా, మంచోడు అవ్వడానికైనా, బాధ్యత గల వ్యక్తిగా నిలబడటానికైనా ఒక ఆడపిల్ల చేతిలోనే ఉంటుందట. అబ్బాయి ఫ్యూచర్ అమ్మాయి చేతిలో డిసైడ్ అవుతుంది. నేను అది బలంగా నమ్ముతున్నా. నన్ను పెళ్లి చేసుకునేవాడు అలా ఉండాలి. మంచి అండర్ స్టాండింగ్ ఉండాలి. గౌరవమైన లైఫ్‌ అంటే చాలా ఇష్టం. ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. నా వరకూ నేను హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయగలను. ఆ నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకమే నా పార్టనర్‌ని డిసైడ్ చేస్తుంది` అని తెలిపింది తనూజ. మొత్తంగా పెళ్లిపై చాలా హోప్స్ పెట్టుకున్న తనూజ పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయాన్ని సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది తనూజ.

మొత్తంగా, తనూజ పవన్ సాయితో తనకున్న ప్రత్యేక బంధాన్ని, ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని స్పష్టం చేశారు. వారి బంధం ఎంత బలమైందో, కుటుంబ సభ్యులతో సమానంగా ఆయనకు ఎంత విలువనిస్తున్నారో ఆమె మాటలు తెలియజేశాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.