|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లవర్ బాయ్ తరుణ్ కెరీర్ ముగింపుకు కారణం ఇదేనా? సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ భాస్కర్!

Published: 04-02-2026, 10:35 PM
లవర్ బాయ్ తరుణ్ కెరీర్ ముగింపుకు కారణం ఇదేనా? సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ భాస్కర్!
  • తరుణ్ కెరీర్ ఫేడ్ అవుట్‌కు యాక్షన్ హీరోగా మారాలనే ప్రయత్నమే కారణమని విజయ్ భాస్కర్ అన్నారు.
  • తరుణ్‌కు రొమాంటిక్ డ్రామాలే సెట్ అవుతాయని విజయ్ భాస్కర్ ముందే హెచ్చరించారు.
  • అమితాబ్ బచ్చన్, అమోల్ పలేకర్ ఉదాహరణలతో తరుణ్‌కు విజయ్ భాస్కర్ సలహా ఇచ్చారు.
  • సరైన కథ దొరికితే తరుణ్‌తో మళ్ళీ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని విజయ్ భాస్కర్ తెలిపారు.

లవర్ బాయ్ ఇమేజ్‌తో ఒకప్పుడు వెలిగిన తరుణ్, ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆయన ఫేడ్ అవుట్ కావడానికి గల కారణాలను ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తరుణ్ ఫేడ్ అవుట్‌కు కారణం?

Tarun Career: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి చిత్రాలతో లవర్ బాయ్‌గా ఒక వెలుగు వెలిగిన హీరో తరుణ్. ఒక దశలో యువతలో సెన్సేషన్‌గా మారిన ఈ హీరో, ఆ తర్వాత కొంత కాలంగా ప్రేక్షకులకు కనబడటమే మానేశారు. అడపా దడపా సినిమా పార్టీల్లో మాత్రమే కనిపించారు. సినిమాలకు దాదాపు దూరం అయ్యారు. అయితే ఆయన సినిమాకు దూరం కావడానికి గల కారణాలను, అసలు ఆయన ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యారనే విషయంపై ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Read also- Suspens Thriller OTT : దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

విజయ్ భాస్కర్ హెచ్చరిక

విజయ్ భాస్కర్ అభిప్రాయం ప్రకారం, తరుణ్ తనకున్న ‘సాఫ్ట్ రొమాంటిక్ హీరో’ ఇమేజ్ నుండి బయటపడి, యాక్షన్ హీరోగా నిరూపించుకోవాలని ప్రయత్నించడమే ఆయన కెరీర్‌కు మైనస్ అయ్యింది. ఆ సమయంలో అందరూ యాక్షన్ సినిమాలు చేస్తున్నారని, తరుణ్ కూడా అటువైపే మొగ్గు చూపారని ఆయన తెలిపారు. అయితే అది వర్క్ అవుట్ కకపోవడంపై అసలు ఇప్పడు సినిమాలే తీయడంలేదు. అప్పటికే దర్శకుడు విజయ్ భాస్కర్ తరుణ్ ను హెచ్చరించినట్లు తెలిపారు.. “నీకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. నువ్వు అందరిలా యాక్షన్ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. నీకు రొమాంటిక్ డ్రామాలు బాగా సెట్ అవుతాయి” అని తాను అప్పట్లోనే తరుణ్‌కు సూచించినట్లు విజయ్ భాస్కర్ వెల్లడించారు.

తరుణ్‌కు విషయం అర్థం కావడానికి ఆయన అమితాబ్ బచ్చన్, అమోల్ పలేకర్ ఉదాహరణలను చెప్పేవారట. అమితాబ్ బచ్చన్ పెద్ద యాక్షన్ సినిమాలు చేస్తున్న కాలంలోనే, అమోల్ పలేకర్ తనదైన శైలిలో క్లాసిక్ సినిమాలు చేస్తూ గొప్ప విజయాన్ని అందుకున్నారని, తరుణ్ కూడా తన బలాన్ని (రొమాంటిక్ సినిమాలు) నమ్ముకోవాల్సిందని ఆయన అన్నారు. తరుణ్ యాక్షన్ సినిమాల కోసం వేచి చూడటం లేదా అలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల కొన్ని అవకాశాలు చేజారాయని, అప్పుడు చేసిన కొన్ని సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మళ్ళీ సినిమా చేసే ఆలోచనలో విజయ్ భాస్కర్

Read also- Barabar Premistha: యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి నిర్మాత ఏం చేశారో తెలుసా.. ఇది హైలెట్..

తరుణ్ చాలా తెలివైన నటుడని, కేవలం కొన్ని నిర్ణయాలు లేదా కాలం కలిసి రాకపోవడం వల్లే గ్యాప్ వచ్చిందని విజయ్ భాస్కర్ అన్నారు. సరైన కథ కుదిరితే తరుణ్‌తో మళ్ళీ సినిమా చేయడానికి తాను సిద్ధమేనని, ఇప్పటికీ ప్రేక్షకులు తరుణ్‌ను మిస్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తరుణ్ తల్లి రోజారమణి కూడా తరుణ్ సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారని, త్వరలోనే ఆయన నుండి ఒక మంచి సినిమా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తరుణ్ టాలెంట్ ఉన్న నటుడని, సరైన కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తానని విజయ్ భాస్కర్ అన్నారు. తరుణ్ తిరిగి సినిమాల్లోకి వస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.