|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తరుణ్, ఈషాల గుట్టు రట్టు! ప్రేమ పక్షుల్లా మళ్ళీ కెమెరాకు చిక్కారా?

Published: 28-02-2026, 12:35 AM
తరుణ్, ఈషాల గుట్టు రట్టు! ప్రేమ పక్షుల్లా మళ్ళీ కెమెరాకు చిక్కారా?
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రహస్య వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగింది.
  • తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బల జంట దీపావళి వేడుకల్లో కలిసి కనిపించడంతో ప్రేమ వార్తలు ఊపందుకున్నాయి.
  • ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాలో తరుణ్, ఈషా కలిసి నటించారు.
  • విజయ్, రష్మికల పెళ్లికి హాజరైన ఈ జంట, ఆ తరువాత ఎయిర్‌పోర్టులో కలిసి కనిపించారు.

టాలీవుడ్‌లో మరో జంట ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల తర్వాత తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బల జంట తరచూ కలిసి కనిపిస్తుండటంతో వీరి మధ్య ఏదో నడుస్తుందనే చర్చ జరుగుతోంది.

విజయ్, రష్మికల వివాహంతో వెలుగులోకి తరుణ్, ఈషా

Tarun – Eesha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దాదాపు 8 సంవత్సరాల పాటు తమ బంధాన్ని ఎక్కడ రివీల్ చేయకుండా రహస్యంగా ప్రేమాయణం కొనసాగించారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , రష్మిక మందన్న (Rashmika mandanna).. ఇన్నేళ్ల రహస్య ప్రేమాయణానికి తెరదింపుతూ ఎట్టకేలకు ఫిబ్రవరి 26న ఉదయపూర్ లోని హై ప్రొఫైల్ ప్యాలెస్ లో 100 మంది సన్నిహితులు, అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా రెండు మత ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇక అలా ఇన్ని సంవత్సరాలుగా రూమర్డ్ జంటగా ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు తమ బంధంలోకి అడుగుపెట్టేశారు. అయితే ఇప్పుడు వీరి బాటలోనే మరో జంట కూడా నడుస్తోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. వారెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ కం హీరో తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బ (Eesha Rebba).

ఈమధ్యకాలంలో ఎక్కువగా వీరిద్దరూ జంటగా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఈ రూమర్స్ ఇలా ప్రధానంగా వినిపించడానికి కారణం ప్రముఖ హీరో విశ్వక్ సేన్ తన ఇంట్లో జరిపిన దీపావళి సెలబ్రేషన్స్ లో తరుణ్ , ఈషా జంటగా కనిపించడమే.. పైగా విశ్వక్ సేన్ అందుకు సంబంధించిన ఫోటోలను బయట పెట్టడంతోనే ఈ జంట రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ కూడా అక్కడక్కడ కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. దీనికి తోడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ పోషిస్తూ.. ఈషా రెబ్బ హీరోయిన్ గా విలేజ్ కామెడీగా వచ్చిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏ.ఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతూ.. ఎస్ ఒరిజినల్ మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్ పై సృజన్ ఎరబోలు , ఆదిత్య పిట్టీ , వివేక్ కృష్ణని తదితరులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈషా రెబ్బతో రిలేషన్ గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు తరుణ్ భాస్కర

దీపావళి వేడుకల్లో కలిసి కనిపించిన జంట

తరుణ్ భాస్కర్ ఈషా ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఆయన ఈషా అంటే నాకు చాలా ఇష్టమని కాకపోతే అసలు విషయాన్ని చెప్పడానికి కాస్త సమయం పడుతుందని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు. కానీ ఆయన అధికారికంగా ప్రకటించలేదు. దీనికి తోడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి ఈ జంట వెళ్లి అక్కడ సందడి చేసింది. మళ్లీ ఇప్పుడు ఎయిర్పోర్టులో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాలో వీరి కెమిస్ట్రీ

తాజాగా విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్లి ఉదయపూర్ లో నిర్వహించగా.. ఆ పెళ్లి వేడుకలను పురస్కరించుకొని నేడు ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ఇందులో రూమర్స్ రావడానికి కారణం ఏముంది అనే విషయానికి వస్తే .. తరుణ్ భాస్కర్ ఈషా లగేజ్ తీసుకు రావడమే ఇక్కడ సంచలనంగా మారింది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్, ఈషా, శ్రావ్య వర్మ ముగ్గురు ఎయిర్పోర్ట్ లో.కనిపించగా.. ఈషా లగేజ్ ని కూడా తరుణ్ భాస్కర్ తీసుకురావడంతో ఇక అసలు రూమర్స్ మళ్లీ మొదలయ్యాయి. మొత్తానికైతే ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు కనీసం ఈసారైనా ఓపెన్ అవ్వండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఏదేమైనా ఈ జంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండస్ట్రీలో మరో రూమర్డ్ జంట తెరపైకి వచ్చిందని .. వీరు కూడా రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ లాగే రహస్యంగా ఎఫైర్ కొనసాగించి హాట్ బాంబు ఒక్కసారిగా పేల్చేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఎప్పుడు ఈ జంట అధికారికంగా తమ బంధాన్ని రివీల్ చేస్తారో చూడాలి.

మొత్తానికి తరుణ్, ఈషా వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా లేక మంచి స్నేహితులా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.