|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ విజేత ఇమ్మాన్యుయేల్ అయ్యేవాడు.. టేస్టీ తేజ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Published: 24-12-2025, 1:32 AM
బిగ్ బాస్ విజేత ఇమ్మాన్యుయేల్ అయ్యేవాడు.. టేస్టీ తేజ సంచలన వ్యాఖ్యలు వైరల్!
  • బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ కళ్యాణ్ పడాలా, టాప్ 5లో ఇమ్మాన్యుయేల్.
  • కమెడియన్స్ బిగ్ బాస్ గెలవలేరనే అభిప్రాయంపై టేస్టీ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు.
  • నామినేషన్స్‌లో లేకపోవడం వల్లనే ఇమ్మాన్యుయేల్ ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వలేదని తేజ అభిప్రాయం.
  • నామినేషన్స్‌లో ఉండి ఉంటే ఇమ్మాన్యుయేల్ విజేత అయ్యేవాడని టేస్టీ తేజ ధీమా.

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ముగిసిన తర్వాత విజేతపై పలు చర్చలు జరుగుతున్నాయి. తాజాగా టేస్టీ తేజ బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా, రన్నరప్ ఇమ్మాన్యుయేల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ అలా జరిగి ఉంటే ఇమ్మాన్యుయేల్ ఖచ్చితంగా విజేత అయ్యేవాడని తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కమెడియన్స్ బిగ్ బాస్ గెలవలేరా?: టేస్టీ తేజ

TastyTeja : ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు పూర్తయింది. కళ్యాణ్ పడాలా ఈ సీజన్ విన్నర్ గా నిలిచాడు. విన్నర్ అవుతారు అనుకున్న తనూజ, జబర్దస్త్ ఇమ్మాన్యూల్ టాప్ 5 లో ఉండిపోయారు. అయితే గత సీజన్స్ లో బిగ్ బాస్ కి వెళ్లిన కమెడియన్స్ టేస్టీ తేజ, రోహిణి, అవినాష్.. పలువురు కమెడియన్స్ బిగ్ బాస్ విన్నర్స్ అవ్వలేరు అని వ్యాఖ్యలు చేశారు.(Tasty Teja)

తాజాగా బిగ్ బాస్ ఫేమ్, నటుడు, యూట్యూబర్ టేస్టీ తేజ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా కమెడియన్స్ బిగ్ బాస్ విన్నర్స్ అవ్వలేరు అనే వ్యాఖ్యలపై ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

ఇమ్మాన్యుయేల్ విజేత ఎందుకవ్వలేకపోయాడు?

టేస్టీ తేజ మాట్లాడుతూ.. జనాలు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఇమ్మాన్యుయేల్ గెలిస్తే బాగుంటుంది. జనాలు అంతా సినిమాలో హీరోలు గెలిస్తే సూపర్ అంటారు. కమెడియన్ గెలిస్తే అంతగా పట్టించుకోరు. కమెడియన్ అంటే అలా ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇమ్మాన్యుయేల్ దానికి అతీతుడు అని నాకు అనిపించింది. గేమ్స్ పరంగా, టాస్కుల పరంగా నెక్స్ట్ లెవల్ ఆడాడు.

నామినేషన్స్, ఓట్ బ్యాంక్ ప్రభావం

కానీ ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లోకి ఎక్కువగా రాకపోవడం వల్ల వాడికి ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అవ్వలేదు. అది అతనికి మైనస్. బిగ్ బాస్ లో జరిగే కంటెంట్ చూసి జనాలు ఓట్ వేస్తారు. నామినేషన్స్ లో ఉంటే ఓట్ వేస్తాము. ఇమ్మాన్యుయేల్ బాగా ఆడినా అభినందిస్తాం కానీ నామినేషన్స్ లో లేకపోతే ఓట్ వేరే వాళ్లకు వేస్తాము. ఇక్కడ అదే హాజరిగింది. ఒకవేళ ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లో ఉండి ఉంటే ఇమ్మాన్యుయేల్ ని మించిన విన్నర్ లేడు అక్కడ అని అన్నారు. దీంతో టేస్టీ తేజ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టేస్టీ తేజ వ్యాఖ్యలు బిగ్ బాస్ అభిమానుల్లో కొత్త చర్చకు దారితీశాయి. కమెడియన్లు విజేతలుగా నిలవలేరనే అభిప్రాయం, నామినేషన్ల ప్రాముఖ్యతపై ఆయన చేసిన కామెంట్స్ ఆలోచింపజేసేవిగా మారాయి. ఇమ్మాన్యుయేల్ అభిమానులు ఈ వ్యాఖ్యలను ఆమోదిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.