|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రొట్టె, చక్కెర మాత్రమే తెచ్చిన విద్యార్థి.. టీచర్ ఏం చేసిందంటే! కన్నీళ్లు ఆగవు!

Published: 09-04-2026, 11:35 PM
రొట్టె, చక్కెర మాత్రమే తెచ్చిన విద్యార్థి.. టీచర్ ఏం చేసిందంటే! కన్నీళ్లు ఆగవు!
  • విద్యార్థి లంచ్ బాక్స్‌లో రొట్టె, చక్కెర చూసి టీచర్ ఆప్యాయంగా ప్రోత్సహించారు.
  • టీచర్ మానవత్వానికి నెటిజన్లు ఫిదా, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
  • చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన నెటిజన్లు.
  • పిల్లల మానసిక వికాసంపై ఉపాధ్యాయుల సానుభూతి ప్రభావం చూపుతుందని నిరూపణ.

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక విద్యార్థి లంచ్ బాక్స్‌లో రొట్టె, చక్కెర మాత్రమే ఉండటం చూసిన టీచర్ అతడిని ప్రోత్సహించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

విద్యార్థి లంచ్ బాక్స్ చూసి టీచర్ రియాక్షన్

సోషల్ మీడియా (Social Media)లో ఓ టీచర్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తన విద్యార్థి లంచ్ బాక్స్‌లో కేవలం రొట్టె, చక్కెర మాత్రమే ఉండటాన్ని చూసిన ఆ ఉపాధ్యాయురాలు, అతడిని చిన్నబోకుండా ఉండేలా ఎంతో ఆప్యాయంగా పలకరించడం నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియోలో, మధ్యాహ్న భోజన సమయంలో ఓ పిల్లాడు తన బాక్స్‌లో కూర లేకుండా కేవలం రొట్టె, చక్కెర మాత్రమే తెచ్చుకున్నాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పిల్లలు ఇబ్బంది పడతారని భావించి, ఆ టీచర్ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అతడిని బాధపకుండా, ఎంతో ప్రేమగా ‘బాగుంది, చక్కగా తిను’ ఎంకరేజ్ చేసింది. అయితే. పిల్లాడి ఆత్మగౌరవానికి దెబ్బతగలకుండా ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే ఆ వీడియో చూసిన నెటిజెన్లు (Netizens) రకరకాలుగా కామెంట్ చేస్తున్నరు ‘విద్య అంటే కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, మానవత్వాన్ని నేర్పించడం కూడా’ అని అంటున్నారు. కొందరు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ‘తాము కూడా చిన్నప్పుడు ఇలాగే తిన్నాము, ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి’ అని భావోద్వేగానికి లోనయ్యారు. తరగతి గదిలో ఓ టీచర్ ప్రదర్శించే చిన్నపాటి సానుభూతి, పిల్లల మానసిక వికాసంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ సంఘటన నిరూపిస్తోంది. ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియోకు ఇప్పుడు ఇంటర్నెట్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

నెటిజన్ల మనసు గెలుచుకున్న ఉపాధ్యాయురాలు

మానవత్వం నేర్పడమే నిజమైన విద్య అంటున్న నెటిజన్లు

టీచర్ చూపిన చిన్నపాటి సానుభూతి పిల్లల మనసుపై ఎంతో ప్రభావం చూపుతుందని ఈ సంఘటన తెలియజేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.