
ఓ టీనేజర్ అమ్మాయి హత్యతో ప్రారంభమయ్యే ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ లో త్వరలో రానుంది. ఎన్నో ట్విస్ట్ లు, టర్న్ లు ఉన్న ఈ సిరీస్ లో హంతకుడు ఎవరో తెలుసుకోవడం ఆసక్తికరం.
Key Points
టీనేజ్ అమ్మాయి హత్య రహస్యం
ఎంతో మంది అనుమానితులు!
కొంకణా సేన్ శర్మ, సూర్య శర్మ నటన
నైనా హత్య రహస్యం
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అభిమానుల కోసం మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ వస్తోంది. జియోహాట్‌స్టార్ స్పెషల్స్ గా వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ ఎంతో ఆసక్తిగా సాగింది. అక్టోబర్ 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ కథేంటి? ఆ హత్యకు గురైంది ఎవరు? అది చేసింది ఎవరు అనే విశేషాలు చూడండి.
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ ట్రైలర్
జియోహాట్‌స్టార్ ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ అనే ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ సిరీస్ అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. నీళ్లలో పడిపోయిన కారును బయటకు తీయడం, అందులో నైనా అనే ఓ టీనేజీ అమ్మాయి శవం ఉండటం మొదట్లోనే చూపిస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇద్దరు ఏసీపీలు రంగంలోకి దిగుతారు.
అనుమానితుల పరంపర
ఏసీపీ సంయుక్త దాస్ (కొంకణా సేన్ శర్మ), ఏసీనీ జై కన్వల్ (సూర్య శర్మ) హంతకుడి వేట మొదలు పెడతారు. అయితే ఆ హత్య కేసును తవ్వే కొద్దీ ఒక్కొక్కరు అనుమానితులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఆమె చదివే కాలేజీ ట్రస్టీ నుంచి బాయ్‌ఫ్రెండ్, ఫ్రెండ్స్, కాలేజీ ప్రొఫెసర్.. ఇలా ఎంతో మందిపై అనుమానం కలుగుతుంది. వాళ్లలో ఎవరు ఆమెను చంపారు? అసలు హంతకుడిని ఎలా పట్టుకున్నారన్నదే ఈ సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ వెబ్ సిరీస్ స్టోరీ.
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ గురించి..
ఈ సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ వెబ్ సిరీస్ ను రోహన్ సిప్పీ డైరెక్ట్ చేశాడు. ఇందులో కొంకణా, సూర్యతోపాటు శ్రద్ధా దాస్, వరుణ్ ఠాకూర్, ధృవ్ సెహగల్, శివ్ పండిట్ లాంటి వాళ్లు నటించారు. ‘సెర్చ్: ది నైనా మర్డర్ కేసు’ అనేది ఒక ఎమోషనల్, పొలిటికల్, సైకలాజికల్ చిక్కుముడి లాంటిది.
జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్
ఈ వెబ్ సిరీస్ క్రియేటర్ సిప్పీ మాట్లాడాడు. “ఈ సిరీస్ లో ఎప్పుడూ ట్విస్ట్‌లు టర్న్‌లు ఉంటాయి. నిజం ఎప్పుడూ అంతుచిక్కకుండా ఉంటుంది” అని వెల్లడించాడు. “ఈ కథలో ప్రతి క్యారెక్టర్ తమ భయాలను, సీక్రెట్‌లను దాచుకుంటూ, తమ సంబంధాలను మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది” అని కూడా చెప్పాడు.
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ వెబ్ సిరీస్ అక్టోబర్ 10 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్విస్ట్ లతో నిండి ఉంటుంది. అక్టోబర్ 10 నుండి జియోహాట్‌స్టార్ లో చూడండి.


