|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తేజ సజ్జ పెళ్లి వార్తల్లో నిజమెంత? పెళ్లిపై తేజ సంచలన ప్రకటన!

Published: 21-03-2026, 7:35 AM
తేజ సజ్జ పెళ్లి వార్తల్లో నిజమెంత? పెళ్లిపై తేజ సంచలన ప్రకటన!
  • తేజ సజ్జ త్వరలో వారాహి సిల్వర్ జువెలరీ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • పెళ్లి చేసుకుంటే సిల్వర్ జువెలరీ వాడుతానని, వాటి గురించి పోస్టులు కూడా చేస్తానని తేజ తెలిపారు.
  • ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి సారించానని, ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని తేజ స్పష్టం చేశారు.
  • తేజ సజ్జ మిరాయ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా ఎదిగిన తేజ సజ్జ పెళ్లి గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఆయన వారాహి సిల్వర్ జువెలరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన పెళ్లి గురించి వస్తున్న ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

వారాహి సిల్వర్ జువెలరీ కార్యక్రమంలో తేజ సజ్జ

Teja Sajja: టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా ఎన్నో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. ఎంతో బిజీగా ఉన్న తేజ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజ సజ్జ తాజాగా వారాహి సిల్వర్ జువెలరీ(Varahi Silver Jewellery) లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు అందరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిపోర్టర్స్ నుంచి తేజ సజ్జకు తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. త్వరలోనే మీ పెళ్లి కూడా జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.. అందుకే జువెలరీ డిజైనింగ్ కూడా చేయించుకున్నారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు తేజ సజ్జ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఈ సిల్వర్ జువెలరీని వేసుకుంటారా అంటూ ప్రశ్నలు ఎదురవడంతో ఈయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

పెళ్లి గురించి తేజ సజ్జ సమాధానం

సందర్భంగా తేజ మాట్లాడుతూ ఇది పెళ్లికి సంబంధించిన వేడుక కాదని తెలిపారు. ఇక తను కనుక పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా తాను సిల్వర్ జువెలరీని వాడుతానని అలాగే వీటి గురించి పోస్టులు కూడా చేస్తానని తెలిపారు. మనం ఎంత ఆడంబరాలకు వెళ్ళామనేది ముఖ్యం కాదు మన పాకెట్ సేఫ్టీ గురించి మన సేఫ్టీ అలాగే కంఫర్ట్ గురించి ఆలోచించాలని, సిల్వర్ కూడా తక్కువ విషయం కాదని తెలిపారు. ఇక మీరు ప్రపోజ్ చేసిన అమ్మాయికి ఫస్ట్ గిఫ్ట్ ఏమిచ్చారు అంటూ కూడా మరో ప్రశ్న ఎదురైంది.ఇలా తేజ లవ్ రూమర్స్ గురించి వస్తున్న వార్తలను బయటపెడుతూ ఈయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేసిన తేజ మాత్రం ఎలాంటి లవ్ లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జ..

కెరీర్‌పై దృష్టి పెట్టిన తేజ

ప్రస్తుతం ఈయన తన పెళ్లిపై కాకుండా కెరియర్ పై దృష్టి సారించారని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తేజ ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం అవుతోంది. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే మిరాయ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరో సక్సెస్ అందుకున్న తేజ ప్రస్తుతం జై హనుమాన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఇటీవల ఈయన ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ‘ది ట్రైటర్స్’ (The Traitors) రియాలిటీ షో తెలుగు వెర్షన్‌కు వ్యాఖ్యాతగా తేజ వ్యవహరించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

మొత్తానికి తేజ సజ్జ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్‌పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయన రాబోయే సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.