
📌 Key Points
- ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్ కానున్నాయి.
- పౌల్ట్రీ కంపెనీలు తక్కువ లాభాల మార్జిన్ ఇవ్వడంతో వ్యాపారుల నిర్ణయం.
- ధరల అసమతుల్యతను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.
- బంద్ కారణంగా చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో చికెన్ వ్యాపారులు సమ్మెకు దిగడంతో గందరగోళం నెలకొంది. పౌల్ట్రీ కంపెనీల విధానాలపై నిరసన తెలుపుతూ ఏప్రిల్ 1 నుంచి షాపులు బంద్ చేయాలని నిర్ణయించారు. దీని ప్రభావం వినియోగదారులపై పడనుంది.
చికెన్ షాపుల బంద్ నిర్ణయం
తెలంగాణలో చికెన్ వ్యాపార రంగంలో గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే జనాలు.. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కొరత ప్రచారంతో ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా చికెన్ షాపులు బంద్ కూడా కానున్నాయని ప్రకటన వచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న అతి తక్కువ లాభాల మార్జిన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని వ్యాపారులు అనుకుంటున్నారు.
సరఫరా అంతరాయాలు, ధరల హెచ్చుతగ్గులపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపు యజమానులు ఏప్రిల్ 1 నుంచి తమ వ్యాపారాలను మూసివేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీలు అందిస్తున్న లాభాల మార్జిన్‌కు నిరసనగా వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని చికెన్ వ్యాపారుల ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నారని చెప్తున్నారు వ్యాపారులు.
‘రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతుంది కానీ తమకు ఇచ్చే మార్జిన్ తగ్గిస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. మార్జిన్ పెంచకపోతే వ్యాపారం చేయలేమని షాపులు మూసివేస్తాం.’ అని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంది.
వ్యాపారుల ఆందోళనకు కారణాలు
ప్రస్తుతం రూ.360 నుంచి రూ. 370 వరకు కిలో చికెన్ ధర ఉంది. ఈ సమస్య ఉప్పల్, ఎల్బీ నగర్ సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బహిరంగ నిరసనలకు దారితీసింది. అక్కడ దుకాణదారులు తమ సమస్యలను తెలియజేస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం ఇకపై లాభదాయకం కాదని వ్యాపారులు అంటున్నారు.
ధరల అసమతుల్యతను పరిష్కరించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని, పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరపాలని చికెన్ షాప్ ఓనర్స్ సంఘం కోరింది. సరఫరాదారుల ఏకపక్ష నిర్ణయాలు చిన్న వ్యాపార యజమానులను నష్టాల్లోకి నెడుతున్నాయని చెబుతోంది.
తమ సమస్యలను పరిష్కరించే వరకు దుకాణాలను తిరిగి తెరవబోమని దుకాణ యజమానులు స్పష్టం చేశారు. న్యాయమైన, సుస్థిరమైన వ్యాపార పరిస్థితులకు నిరసన అవసరమని పేర్కొంటూ, ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలపై ప్రభావం
ప్రణాళిక ప్రకారం బంద్ జరిగితే.. వినియోగదారులు తక్షణ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. సరఫరాలో ఆకస్మిక నిలుపుదల మార్కెట్లో ధరలు పెరగడానికి దారితీయవచ్చు. గృహాలు, రెస్టారెంట్లు, ఆహార వ్యాపారాలకు కొరతను సృష్టించవచ్చు.
ఇదిలా ఉండగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎగుమతులకు అంతరాయం కలగడంతో గత కొన్ని రోజులుగా గుడ్ల ధరలు తీవ్రంగా పడిపోయాయి. పశ్చిమ ఆసియాకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడమే ఈ క్షీణతకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. యుద్ధం నేపథ్యంలో పెరిగిన భద్రతాపరమైన ఆందోళనలు, నౌకా రవాణా మార్గాలకు అంతరాయాల కారణంగా అనేక కీలక ఓడరేవులు, విమానాశ్రయాలు ప్రభావితమయ్యాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
చికెన్ షాపుల బంద్ నిర్ణయం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. లేదంటే సామాన్యులకు ఇది భారంగా మారనుంది.


