|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Telangana Govt : మహిళా సంఘాలకు శుభవార్త – వడ్డీ లేని రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు

Published: 07-05-2026, 1:30 PM
Telangana Govt : మహిళా సంఘాలకు శుభవార్త - వడ్డీ లేని రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు

రాష్ట్రంలోని మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సున్నా వడ్డీ రుణాల పరిమితిని రెట్టింపు చేసింది. వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల వరకూ అందిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచింది. ఈ విషయాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.

గురువారం జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాల వార్షిక రుణ ప్రణాళిక (2026–27) ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు.

అర్హులైన మహిళా సంఘాలకు ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల వడ్డీ లేని రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. స్వయం సహాయక సంఘాలు తీసుకునే రూ.10 లక్షల వరకు బ్యాంక్ రుణాలపై అయ్యే పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆమె వెల్లడించారు. ఇందుకోసం ఈ ఏడాది రూ. 2,500 కోట్లు కేటాయించామన్నారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా సంఘాలకు రూ. 26,621.47 కోట్ల బ్యాంక్ క్రెడిట్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది (2025-26) రూ,25,228.89 కోట్ల రుణాలు అందించడం జరిగింది.

“మహిళా సాధికారతే తెలంగాణ ప్రగతి” అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో ఒక కోటి మంది మహిళా కోటీశ్వరులను (Millionaires) సృష్టించడమే తమ లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు. ఇప్పటికే 40 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకే అప్పగించినట్లు గుర్తుచేశారు.

మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నారని… ఎన్పీఏ (NPA) శాతం కేవలం 1.40 మాత్రమే ఉందని మంత్రి సీతక్క ప్రశంసించారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో సున్నా శాతం ఎన్పీఏ సాధించడం గర్వకారణమని…. ఆ జిల్లాను మిగిలిన వారు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలు ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని ఆమె పేర్కొన్నారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.