
📌 Key Points
- తెలంగాణలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రేషన్ కార్డు రద్దు అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
- ఆదాయం రూ. 6 లక్షలు దాటితే రేషన్ కార్డు రద్దు చేస్తారనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- క్షేత్రస్థాయిలో అధికారులు ఆదాయపు పన్ను రికార్డులను సరిచూస్తున్నారు.
- కొత్త రేషన్ కార్డుల జారీలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఏరివేత ప్రక్రియ చేపట్టింది.
తెలంగాణలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రేషన్ కార్డు రద్దు అవుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
రేషన్ కార్డు రద్దు ప్రచారం
‘మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారా? అయితే మీ రేషన్ కార్డును కోల్పోయే ప్రమాదం ఉంది..’ ఇప్పుడు తెలంగాణలోని చాలా గ్రామాల్లో ఇదే ప్రచారం జరుగుతోంది. లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో దీనిపై చర్చ నడుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని గ్రామాల్లో ఈ ఆందోళనకరమైన సందేశం ఎక్కువగా వైరల్ అవుతోంది.
‘మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో(ITR) వార్షిక ఆదాయం ఆరు లక్షల రూపాయలకు పైగా చూపిస్తే, మీ రేషన్ కార్డు రద్దు కావొచ్చు.’ అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. గ్రామ పరిపాలన అధికారులు(GPO)లు ఇంటింటికీ వెళ్లి, కార్డుదారుల నుండి డిక్లరేషన్లను సేకరించి, ఆదాయపు పన్ను రికార్డులను సరిచూస్తున్నారు. దీంతో ఈ భయం మరింతగా ఎక్కువైంది.
క్షేత్రస్థాయిలో విచారణ
ప్రభుత్వ పథకాలకు ప్రామాణికంగా ఉన్న.. రేషన్ కార్డులు ఎక్కడ తమ నుంచి జారిపోతాయో అనే భయంలో జనాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రేషన్ కార్డులో ఉన్నవారిలో ఒకరు ఆరు లక్షలపైనా సంపాదించినా.. రేషన్ కార్డు వెంటనే రద్దు చేస్తారనే ప్రచారాన్ని చేస్తున్నారు. జీపీఓలు కూడా అర్హతపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 30 వేలకుపైగా, సిద్దిపేట జిల్లాలో 14 వేలకుపైగా మందిపై ఈ విచారణ జరుగుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
చాలా మంది రుణాలు పొందడానికో, టీడీఎస్ రిఫండ్ కోసమో.. లేదా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేస్తారు. ఇప్పుడు అవే ఫైలింగ్‌లతో రేషన్ కార్డు రద్దు అవుతుందా అనే భయం నెలకొన్నది. రేషన్ కార్డు కేవంల బియ్యం కోసం మాత్రమే కాదు.. ఇందిరమ్మ ఇంటికి, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీవంటి పథకాలకు కూడా వర్తిస్తుంది.
ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూపు
ఇప్పుడు విచారణ పేరుతో తమ కార్డులను ఎక్కడ తొలగిస్తారోననే భయం ఊర్లలో చాలా మందిలో ఉంది. అయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో అవకతవకలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం.. పౌరసరఫరాల శాఖ ద్వారా ఏరివేత ప్రక్రియ కూడా గతంలో చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా తనిఖీలు చేస్తున్నారని కూడా కొందరి వాదన. అంటే కేవలం అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రేషన్ కార్డుల రద్దుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఐటీ రిటర్న్స్ ఆధారంగా రేషన్ కార్డుల రద్దు గురించి ప్రజల్లో నెలకొన్న భయాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలి. దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తే ప్రజలు ఆందోళన చెందకుండా ఉంటారు.


