|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Telangana Rising Global Summit 2025: ‘సెషన్‌ ఆఫ్‌ సినిమా రైజింగ్‌’లో సినీ సెలబ్రిటీల కామెంట్స్!

Published: 09-12-2025, 6:48 AM
Telangana Rising Global Summit 2025: ‘సెషన్‌ ఆఫ్‌ సినిమా రైజింగ్‌’లో సినీ సెలబ్రిటీల కామెంట్స్!
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
  • ‘సెషన్ ఆఫ్ సినిమా రైజింగ్’లో అల్లు అరవింద్, సురేష్ బాబు, అర్జున్ కపూర్, రాహుల్ రవీంద్రన్ పాల్గొన్నారు.
  • రాహుల్ రవీంద్రన్, అర్జున్ కపూర్ సినీ పరిశ్రమ అభివృద్ధికి సమ్మిట్‌లు అవసరమన్నారు.
  • సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ‘సెషన్‌ ఆఫ్‌ సినిమా రైజింగ్‌’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అల్లు అరవింద్, అర్జున్ కపూర్ తదితరులు పాల్గొని, సినిమా అభివృద్ధిపై తమ విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు. ఇది పరిశ్రమ భవిష్యత్తుకు మార్గదర్శకం.

సమ్మిట్‌కు హాజరైన ప్రముఖులు

Telangana Rising Global Summit 2025: ‘ తెలంగాణ రైజింగ్ ‘ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ ‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ ‌ సమ్మిట్ ‌ లో ఘనంగా జరిగింది . సోమవారం జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థ ప్రతినిథులు , సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు .

రెండు రోజులు ( సోమవారం , మంగళవారం ) జరిగిన ఈ సమ్మిట్ ‌ లో రెండు రోజు సమ్మిట్ ‌ లో నిన్న జరిగిన కార్యక్రమంలో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇందులో భాగంగా దేశంలో పెట్టుబడులు , వ్యాపార సంస్థలపై సమావేశం నిర్వహించారు . ఇక రెండో రోజు సమ్మిట్ ‌ లో భాగంగా సెషన్ ‌ ఆఫ్ ‌ సినిమా రైజింగ్ పేరుతో సమావేశం నిర్వహించారు . దీనికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్యానెల్ స్పీకర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి వ్యవహరించగా .. దిల్ రాజు,అర్జున్ కపూర్, అమ‌ల, దామోదర్ ప్రసాద్, బలగం వేణు, సుప్రియ , రాహుల్ ‌ రవింద్రన్ ‌ వంటి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు .

‘సినిమా రైజింగ్’లో సినీ ప్రముఖుల అభిప్రాయాలు

ఈ సందర్భంగా యాక్టర్ అండ్ డైరెక్టర్ రాహుల్ ‌ రవీంద్ర మాట్లాడుతూ .. గ్లోబల్ సమ్మి పానెల్ చర్చలో పాల్గొనడం ఎక్సయిటెడ్ గా ఉందని , సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి చర్చలు సమ్మిట్స్ ‌ అవసరమన్నారు . అలాగే పానెల్ ‌ చర్చల ద్వారా తాను మరింత నేర్చుకునే అవకాశం ఉందని , సినీ పరిశ్రమ అభివృద్ధి మరింతగా జరగాలని అందరం కోరుకుంటున్నామన్నారు . ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిస్తే ఎన్నో అద్భుతాలు , విజయాలు సాధించోచ్చని ఆయన అభిప్రాయపడ్డారు .

సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్చలు

అదే విధంగా బాలీవుడ్ ‌ నటుడు అర్జున్ కపూర్ మాట్లాడుతూ .. ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనటం సంతోషం గా ఉందన్నారు . విద్యార్తిగా సమ్మిట్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటానని , ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అందరం కలిపి పనిచేయాలన్నారు . కొత్త ఫిల్మ్ సిటీ రావడం సినిమా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని , సినిమా పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు వస్తున్నారని పేర్కొన్నారు .

ఈ సమ్మిట్ సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం, పెట్టుబడుల ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ప్రముఖుల అభిప్రాయాలు భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమ మరింత వృద్ధి చెందడానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఆశిస్తున్నారు. ఇలాంటి సదస్సులు పరిశ్రమకు ఎంతో ప్రయోజనకరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.