
📌 Key Points
- తెలంగాణ నుంచి నార్త్‌కు 3 కొత్త రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంజూరు.
- హైదరాబాద్ – జైపూర్, చర్లపల్లి – అగర్తలా, కాచిగూడ – శ్రీ గంగానగర్ రైళ్లు.
- ఈ రైళ్లు జూలై నెల నుంచి శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి వస్తాయి.
- ఆంధ్రప్రదేశ్ మీదుగా కూడా ఈ రైళ్లు ప్రయాణిస్తాయి, పలు నగరాల్లో స్టాప్‌లు.
భారతీయ రైల్వే శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు శుభవార్త అందించింది. తెలంగాణ నుంచి నార్త్‌కు మూడు కొత్త రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంజూరు చేసింది. ఈ నిర్ణయం ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది.
కొత్త రైళ్ల వివరాలు, రూట్ మ్యాప్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ సూపర్ న్యూస్ అందించింది. రాబోయే పండుగలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నుంచి రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలకు (నార్త్ ఈస్ట్) మూడు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంజూరు చేసింది. గతంలో ‘స్పెషల్ ట్రైన్స్’గా నడిచిన వీటిని ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
ఈ కొత్త రైలు సర్వీసులు జూలై నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్ల సమయాలు, రూట్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
గత కొంతకాలంగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రైళ్లలో హైదరాబాద్ – జైపూర్, చర్లపల్లి – అగర్తలా, కాచిగూడ – శ్రీ గంగానగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్లే పర్యాటకులు, వ్యాపారస్తులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. జూలై 24 నుంచి సర్వీస్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ టూ జైపూర్ (17079) ప్రతి శుక్రవారం రాత్రి 7:50 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. జైపూర్ టూ హైదరాబాద్ (17080) జూలై 26 నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జైపూర్‌లో తిరుగు ప్రయాణం అవుతుంది.
హైదరాబాద్ – జైపూర్ రైలు వివరాలు
ప్రధాన స్టాపింగ్‌లు: సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్, అకోలా, భోపాల్, ఉజ్జయిని, రత్లాం, అజ్మీర్.
హైదరాబాద్ చర్లపల్లి టెర్మినల్ నుంచి ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు ఈ రైలు నడవనుంది. జూలై 27 నుంచి సర్వీస్ ప్రారంభం కానుంది. చర్లపల్లి టూ అగర్తలా (17031) ప్రతి సోమవారం సాయంత్రం 4:20 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. అగర్తలా టూ చర్లపల్లి (17032) జూలై 31 నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 5:30 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.
ప్రధాన స్టాపింగ్‌లు: ఈ రైలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం మీదుగా త్రిపుర చేరుకుంటుంది. విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, గువహాటి, న్యూ హాఫ్లాంగ్ వంటి కీలక నగరాల్లో ఈ రైలు ఆగనుంది.
తెలంగాణ నుంచి రాజస్థాన్‌లోని సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రైలు ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది. జూలై 25 నుంచి సర్వీస్ ప్రారంభం అవుతుంది. కాచిగూడ టూ శ్రీ గంగానగర్ (17061) ప్రతి శనివారం రాత్రి 10:00 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది. శ్రీ గంగానగర్ టూ కాచిగూడ (17062) జూలై 28 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 6:55 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.
చర్లపల్లి – అగర్తలా రైలు మార్గం
ప్రధాన స్టాపింగ్‌లు: మల్కాజ్‌గిరి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, భోపాల్, జైపూర్, బికానెర్, సూరత్‌గఢ్.
సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్లపై రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి స్టేషన్‌ను రైల్వే శాఖ అభివృద్ధి చేసింది. నార్త్ ఈస్ట్ వెళ్లే ప్రయాణికులు నగరం వెలుపల నుంచే ఈ సేవలను సులువుగా పొందవచ్చు. ఈ రెగ్యులర్ రైళ్లకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్లు త్వరలోనే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, కౌంటర్లలో ప్రారంభం కానున్నాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ కొత్త రైలు సర్వీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందిస్తాయి. పండుగల రద్దీని తగ్గించి, సుదూర ప్రాంతాలకు సులభంగా చేరుకోవడానికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.


