
రాజ్ తరుణ్ హీరోగా, అదిరే అభి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ మూవీ ‘చిరంజీవ’ నేరుగా ఆహా ఓటీటీలోకి రాబోతోంది. ఎవరెప్పుడు చనిపోతారో ముందే తెలుసుకునే విచిత్రమైన వరం ఉన్న అంబులెన్స్ డ్రైవర్ కథతో ఈ చిత్రం ఆసక్తికరంగా ఉండనుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Key Points
రాజ్ తరుణ్ నటించిన మరో కామెడీ చిత్రం ఓటీటీలోకి వస్తోంది.
ఎవరెప్పుడు చనిపోతారో ముందుగా తెలుసుకునే హీరో కథాంశం.
అదిరే అభి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆహా వీడియోలో రిలీజ్.
ట్రైలర్ సోమవారం రిలీజ్; నవ్వులు పంచుతుందని మేకర్స్ వెల్లడి.
చిరంజీవ మూవీ: ఓటీటీ విడుదల వివరాలు
మరో తెలుగు కామెడీ మూవీ నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ సోమవారం (అక్టోబర్ 27) రిలీజైంది. ఎవరు ఎప్పుడు చస్తారో ముందే తెలుసుకునే వరం సంపాదించిన హీరో చుట్టూ తిరిగే సినిమా ఇది.
ఆహా వీడియో ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ తెలుగు కామెడీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ (అదిరే అభి) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ లీడ్ రోల్ పోషించాడు. తాజాగా సోమవారం (అక్టోబర్ 27) మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఎవరెప్పుడు చస్తారో తెలుసుకునే హీరో కథ
ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా సాగిపోయింది. ఓ అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్న హీరో తనకు ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకునే శక్తి వచ్చిన తర్వాత ఎలా ఎదుగుతాడో చూపించే కథగా ఈ చిరంజీవ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఆ బిడ్డ మహర్జాతకుడు.. సమయం వచ్చినప్పుడు అతని సామర్థ్యం తెలుస్తుంది అంటూ రాజ్ తరుణ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఓ దున్నపోతు అంబులెన్స్ కు అడ్డం రావడంతో అతని జీవితం మారిపోతుంది.
రాజ్ తరుణ్, అదిరే అభిల కాంబినేషన్
ట్రైలర్ చూస్తుంటే.. ఓటీటీ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు ఓ భిన్నమైన కథతో మూవీ వస్తుండటం కూడా ఆసక్తి రేపుతోంది. అసలు హీరోకి ఈ మూవీలో ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకునే శక్తి ఎలా వచ్చింది? దానిని అతడు తాను ఎదగడానికి ఎలా ఉపయోగించుకుంటాడు? అది అతన్ని కూడా ఎలా కష్టాల్లోకి నెట్టేస్తుందన్నది ఈ చిరంజీవ మూవీలో చూడొచ్చు.
భిన్నమైన కథాంశం, రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్, అదిరే అభి దర్శకత్వ ప్రతిభతో ‘చిరంజీవ’ ఓటీటీ ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి హీరో తన ప్రత్యేక శక్తిని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.


