|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు క్రైమ్‌ డ్రామా! (23)

Published: 29-06-2025, 6:44 AM
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు క్రైమ్‌ డ్రామా! (23)

Key Points

1

మల్లేశం ఫేం రాజ్ రాచకొండ దర్శకత్వం

2

1991 చిలకలూరిపేట బస్సు దహనం ఆధారంగా కథ

3

అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

23 సినిమా విడుదల మరియు ఓటీటీ ప్రయాణం

చిన్న సినిమాలో ఓటీటీలో దూసుకెళ్తున్నాయి. థియేటర్స్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్ర సూపర్‌ హిట్‌గా నిలుస్తున్నాయి. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు 23 మూవీ కూడా చేరింది. మల్లేశం’ఫేం రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ డ్రామా మే 16న థియేటర్స్‌లో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక రీసెంట్‌గా ఓటీటీలో విడుదలై మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఒకేసారి మూడు ఓటీటీల్లో ఈ చిత్రం ప్రీమియర్‌ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌తో పాటు ఆహా, ఈటీవీ విన్‌లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. అలాగే ఆహాలో ట్రెండింగ్‌ అవుతున్న టాప్‌ 10 సినిమాలో టాప్‌ 2 ప్లేస్‌లో ఈ చిత్రం ఉంది.

23  విషయానికొస్తే..1991లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సాగర్(తేజ) ఓ పల్లెటూరిలో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలనేది కోరిక. కానీ అప్పు దొరకదు. పొగాకు కూలీ సుశీల(తన్మయి)ని ప్రేమిస్తుంటాడు. పెళ్లి కాకుండానే ఈమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దీంతో తన ఫ్రెండ్ దాస్‌తో కలిసి బస్సు దోపిడీ చేయాలని అనుకుంటాడు. కానీ అది అమలు చేసే క్రమంలో ప్రయాణికులు తిరగబడతారు. అనుకోకుండా నిప్పంటుకుని 23 మంది సజీవ దహనం అయిపోతారు. తర్వాత ఏమైంది? కోర్టు ఏం తీర్పు ఇచ్చిందనేదే మిగతా స్టోరీ.

కథాంశం మరియు ప్రధాన పాత్రలు

ఓటీటీలో విజయం

చిన్న సినిమా ’23’ ఓటీటీలో అనూహ్య విజయం సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రైమ్ డ్రామా ప్రేమికులకు ఇది తప్పక చూడాల్సిన చిత్రం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.