
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను ప్రతిబింబించే ‘మయసభ’ అనే వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఇద్దరు ప్రముఖ నేతల జీవితాలను ఆధారంగా తీసిన ఈ సిరీస్ ఆగస్టు 7న సోనీ లివ్ లో ప్రసారం కానుంది.
Key Points
మయసభ: చంద్రబాబు, వైఎస్ జీవితాలను పోలిన పొలిటికల్ థ్రిల్లర్!
ఆగస్ట్ 7న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ ప్రారంభం.
ట్రైలర్ లో చూపించిన స్నేహం, వైరానికి ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది.
మయసభ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
తెలుగులో మరో పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. వచ్చే నెల తొలి వారంలోనే స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను గురువారం (జులై 31) మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇద్దరు అత్యంత శక్తివంతమైన నేతలైన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాలు, వారి స్నేహం, రాజకీయ వైరాలను పోలి ఉన్న ఈ సిరీస్ పేరు మయసభ.
మయసభ వెబ్ సిరీస్ టీజర్ ఈ నెల మొదట్లోనే రిలీజైన విషయం తెలిసిందే. ఆ టీజర్ వచ్చినప్పుడే దీనిని చంద్రబాబు, వైఎస్ ఆధారంగా తెరకెక్కించినట్లు తేలిపోయింది. మేకర్స్ అధికారికంగా అదే స్టోరీ అని చెప్పకపోయినా.. కథ మొత్తం వాళ్లదే. ఇప్పుడీ ట్రైలర్ కూడా అలాగే సాగింది. ఇందులో కృష్ణమ నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించారు. ఈ ట్రైలర్ మొదట్లోనే రామిరెడ్డి తండ్రి హత్యకు గురైనట్లు చూపించారు.
చంద్రబాబు, వైఎస్ జీవితాలకు పోలికలు
ఆ శవాన్ని బస్సులోకి ఎక్కించుకోవడానికి నిరాకరించడంతో కృష్ణమ నాయుడు వాళ్లకు అండగా నిలుస్తాడు. అక్కడ, ఆ బస్సులోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. వాళ్లు ప్రాణ స్నేహితులుగా మారతారు. ఆ స్నేహితులే తర్వాతి రోజుల్లో ఎలా రాజకీయ ప్రత్యర్థులుగా మారారన్నదే ఈ మయసభ వెబ్ సిరీస్ స్టోరీ. ఇందులో ఎన్టీఆర్ ను పోలిన పాత్రలో సాయికుమార్ నటించాడు.
మయసభ వెబ్ సిరీస్ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. దేవ కట్టా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ట్రైలర్ ను ఆ ఓటీటీయే తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఇద్దరు అత్యంత శక్తివంతమైన, ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తుల జీవితాలను పోలేలా ఈ సిరీస్ కథ ఉండటంతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.
ఆగస్టు 7న సోనీ లివ్ లో ప్రసారం
దీంతో రిలీజ్ కు ముందే ఈ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పై బజ్ క్రియేటైంది. టీజర్, ట్రైలర్లోని డైలాగులు, నిజ జీవిత ఘటనలను పోలిన సీన్లు మరింత ఆసక్తి రేపుతున్నాయి. వాళ్ల స్నేహం, రాజకీయ వైరాన్ని తెరపై ఎలా చూపించబోతున్నారన్నది మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. మయసభ వెబ్ సిరీస్ ఆగస్ట్ 7 నుంచి తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మొత్తంగా, ‘మయసభ’ వెబ్ సిరీస్ తెలుగు రాజకీయాలను ఆసక్తికరంగా చూపించనుందని ట్రైలర్ సూచిస్తోంది. ఆగస్టు 7 వరకు ఎదురుచూడటం తప్ప మరో మార్గం లేదు.


