|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు! చివరి తేదీ ఎప్పుడో తెలుసా? విద్యార్థులకు గుడ్ న్యూస్!

Published: 02-04-2026, 5:35 AM
లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు! చివరి తేదీ ఎప్పుడో తెలుసా? విద్యార్థులకు గుడ్ న్యూస్!
  • తెలంగాణ లాసెట్-2026 దరఖాస్తు గడువు ఏప్రిల్ 10 వరకు పొడిగింపు.
  • ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన అధికారులు.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ. 900, ఇతరులకు రూ. 1100.
  • 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, 3 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, 2 ఏళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు.

తెలంగాణలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్-2026 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఫైన్ లేకుండా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ – 2026 కు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి . ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఫైన్ లేకుండానే అప్లికేషన్ చేసుకునేందుకు ఏప్రిల్ 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

ఇంటర్‌ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు, డిగ్రీ విద్యార్హతపై మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 10వ తేదీ దాటితే…. నిర్ణేశించిన ఫీజుతో పాటు ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు వివరాలు

టీజీ లాసెట్ – 2026 అప్లికేషన్ సాధారణ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి. పీజీఎల్ సెట్ కు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ఖులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి.

ఏప్రిల్ 10 వరకు అవకాశం

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం. మరింత సమయం ఉండటంతో అభ్యర్థులు నిశ్చింతగా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు సన్నద్ధం కావచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.