|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పాలిసెట్-2026: విద్యార్థులకు గుడ్ న్యూస్! మోడల్ పేపర్లు మీ కోసం, డౌన్‌లోడ్ చేసుకోండి!

Published: 02-03-2026, 3:05 AM
పాలిసెట్-2026: విద్యార్థులకు గుడ్ న్యూస్! మోడల్ పేపర్లు మీ కోసం, డౌన్‌లోడ్ చేసుకోండి!
  • ఏప్రిల్ 20 వరకు టీజీ పాలిసెట్ దరఖాస్తులకు అవకాశం ఉంది.
  • మే 13న పాలిసెట్-2026 పరీక్ష జరుగుతుంది.
  • గత ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
  • పరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2026 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మోడల్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

టీజీ పాలిసెట్-2026: ముఖ్యమైన తేదీలు

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ -2026 ఎంట్రెన్స్ పరీక్షపై మరో అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

టీజీ పాలిసెట్ కు అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అయితే రూ. 250గా నిర్ణయించారు. నిర్ణయించిన గడువు దాటితే నిర్ణయించిన ఫీజుతో పాటు రూ. 100 ఫైన్ తో ఏప్రిల్ 21వ తేదీ వరకు, రూ. 300 తాత్కల్ ఫీజుతో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

తాజాగా టీజీ పాలిసెట్ అభ్యర్థులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. విద్యార్థులకు ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేందుకు గతంలో నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లను(మోడల్ పేపర్లు) అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.

మోడల్ పేపర్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా

టెన్త్ పాస్ అయిన వారితో పాటు ప్రస్తుతం పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు. టీజీ పాలిసెట్ – 2026 పరీక్షను మే 13వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 08031404549 ఫోన్ నెంబర్ లేదా [email protected], మెయిల్ ను సంప్రదింవచ్చు.

4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఇక్కడ చదివితే లోకల్‌గా పరిగణిస్తారు. నాన్‌లోకల్‌ కోటా కింద.. పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలకు ఇతర రాష్ట్రాలకు చెందిన, తెలంగాణలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు

టీజీ పాలిసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (60), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. 10వ తరగతి (SSC) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి మరియు నెగిటివ్ మార్కులు ఉండవు.

టీజీ పాలిసెట్ పరీక్ష నిర్వహణ తర్వాత ప్రాథమిక కీని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో వచ్చే ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి….సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేస్తారు.

పాలిసెట్ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ర్యాంకు సాధించాలని ఆశిస్తున్నాము. కౌన్సిలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.