|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం: సినీ పరిశ్రమలో సంచలనం!

Published: 29-01-2026, 11:35 PM
నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం: సినీ పరిశ్రమలో సంచలనం!
  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌కు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది.
  • గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ చేతుల మీదుగా విశ్వప్రసాద్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
  • గతంలో మోహన్ బాబు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డును అందుకున్నారు.
  • విశ్వప్రసాద్ నిర్మాతగా ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి అరుదైన గౌరవం లభించింది. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ నుండి ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

విశ్వప్రసాద్‌కు గవర్నర్ పురస్కారం

T.G.Vishwa Prasad: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో బడా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న వారిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ కూడా ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం ఆధ్వర్యంలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ అధినేత టీజీ విశ్వప్రసాద్(T.G.VishwaPrasad) నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విశ్వప్రసాద్ కు అరుదైన పురస్కారం లభించింది. ఈ విషయాన్ని ఈయన అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాత  విశ్వప్రసాద్ కు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్స లెన్స్ అవార్డు లభించింది. నేడు ఈయన పశ్చిమబెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద్ బోస్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు .ఇందుకు సంబంధించిన ఫోటోలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించడంతో అభిమానులు కూడా నిర్మాత విశ్వప్రసాద్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతూ ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్నీ అందించినట్టు తెలుస్తుంది.

ఇకపోతే ఇటీవల ఈ పురస్కారాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా అందుకున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని ప్రకటించిన ఈ అవార్డులలో మోహన్ బాబుకు కూడా ఈ పురస్కారాన్ని అందచేయడంతో మంచు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ కూడా ఈ గౌరవాన్ని పొందారు. ఇక విశ్వప్రసాద్ సినిమాల విషయానికొస్తే ఇటీవల ఈయన తన నిర్మాణ సంస్థలో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో తెరకేక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయింది.

మోహన్ బాబుకు లభించిన గౌరవం

Deeply honoured and humbled to share that our Producer @vishwaprasadtg garu has been awarded the West Bengal Governor’s Award of Excellence 🤗

Our heartfelt gratitude to the Hon’ble Governor of West Bengal, Dr. C. V. Ananda Bose ji, for this prestigious recognition bestowed upon… pic.twitter.com/c9mgUz28Jc

— People Media Factory (@peoplemediafcy) January 29, 2026

‘ది రాజా సాబ్’ నిర్మాతకు అభినందనలు

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ జోడిగా మాళవిక మోహన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సుమారు 450 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కిన ఈ సినిమా కనీసం సగం వసూళ్లను కూడా రాబట్ట లేకపోవడంతో నిర్మాత విశ్వప్రసాద్ భారీగా నష్టాలను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.

విశ్వప్రసాద్ గారికి ఈ గౌరవం దక్కడం పట్ల సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.