|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్: డీఎస్పీ అవుట్.. థమన్ ఇన్! పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే!!

Published: 04-03-2026, 1:05 PM
ఉస్తాద్ భగత్ సింగ్: డీఎస్పీ అవుట్.. థమన్ ఇన్! పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే!!
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం!
  • డీఎస్పీ స్థానంలో థమన్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు!
  • మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల!
  • థియేటర్లలో మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్‌కు సిద్ధంగా ఉండండి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఊహించని ట్విస్ట్. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

థమన్ రాకతో ఉస్తాద్ భగత్ సింగ్ కు ఊపు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తా్ద్ భగత్ సింగ్’ కోసం థమన్‌ను రంగంలోకి దింపారు టీమ్. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్ నుండి వచ్చిన ‘దేఖ్‌ లేంగే సాలా’ అండ్ ‘ఔరా ఆఫ్ ఉస్తాద్’కు బ్లాక్ బస్టర్ స్పందన ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంగీతం పట్ల మీకున్న ప్రేమ అద్భుతం. రాబోయే పాట కూడా మీ హృదయాలను హత్తుకుంటుందని మేము నమ్ముతున్నాము. రాక్‌స్టార్ డీఎస్పీ అండ్ దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి అభిమానులు పండుగ చేసుకునే పాటలను అందించారు.

అయితే.. ఇప్పుడు, DSP ముందుగా అనుకున్న కాల్ షీట్స్, ఇతర ప్రాజెక్టుల బిజీ షెడ్యూల్ కారణంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం రీల్స్‌ను ఫైనల్ చేయడంలో, పంపడంలో ఆలస్యం అయింది. దీంతో ఆయన నిర్ణయాన్ని గౌవవిస్తూ.. మా (మైత్రీ మూవీ మేకర్స్) పరస్పర అంగీకారంతో.. బీజీయస్ స్కోరు కోసం థమన్‌ను బోర్డులోకి తీసుకొస్తున్నాము. DSP పాటలు మిమ్మల్ని డ్యాన్స్ చేపిస్తాయి.. థమన్ నేపథ్య స్కోరును నిర్వహిస్తాడు. థియేటర్స్‌లో మోమరబుల్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి’ అని మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

డీఎస్పీకి వీడ్కోలు పలికిన మైత్రీ మూవీ మేకర్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థమన్ మ్యాజిక్!

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు థమన్ రావడం ఒక సంచలనంగా మారింది. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక శుభవార్త. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.