|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Trump Movie Tariff : సినిమాలకు ట్రంప్ దెబ్బ.. ట్రంప్ చెప్పింది హాలీవుడ్ సినిమాలకా? అన్ని దేశాల సినిమాలకా? టాలీవుడ్ కి ఎఫెక్ట్..?

Published: 05-05-2025, 3:23 AM
Trump Movie Tariff : సినిమాలకు ట్రంప్ దెబ్బ.. ట్రంప్ చెప్పింది హాలీవుడ్ సినిమాలకా? అన్ని దేశాల సినిమాలకా? టాలీవుడ్ కి ఎఫెక్ట్..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ విధించే ప్రకటన చేశారు. ఈ నిర్ణయం హాలీవుడ్‌ను కాపాడటానికి ఉద్దేశించినదా లేక అన్ని దేశాల సినిమాలను లక్ష్యంగా చేసుకున్నదా అన్నది అనుమానం. ఈ నిర్ణయం టాలీవుడ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.

Key Points

1

ట్రంప్ అమెరికాలో విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ విధించే అవకాశం.

2

హాలీవుడ్ స్టూడియోలను రక్షించడానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయం అని అనుమానాలు.

4

అమెరికాలో సినిమా టికెట్ ధరలు పెరగడం ఖాయం.

ట్రంప్ యొక్క సినిమా టారిఫ్ ప్రకటన

Trump Movie Tariff : అమరికలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక విదేశాల నుంచి వచ్చే అన్నిటికి ట్యాక్సులు వేస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ విధిస్తున్న ట్యాక్స్ లు చర్చగా మారాయి. ఇన్నాళ్లు అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద టారీఫ్స్ వేయగా ట్రంప్ ఇప్పుడు సినిమాల మీద కూడా వేయడం గమనార్హం.

ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో.. అమెరికా సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతుంది. మా దర్శక నిర్మాతలను హాలీవుడ్ స్టూడియోల నుంచి దూరం చేయడానికి వేరే దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ సినీ పరిశ్రమ నాశనం అవుతుంది. ఇది మిగిలిన దేశాలు అన్ని కలిసి చేస్తున్న కుట్ర. దీన్ని దేశభద్రతగా పరిగణిస్తున్నాం. అందుకే విదేశాల్లో నిర్మించి ఇక్కడ అమెరికాలో రిలీజ్ చేసే సినిమాలపై 100 శాతం ట్యాక్స్ విధిస్తున్నాం. ఈ టారిఫ్ అమలు వెంటనే ప్రారంభించాలని వాణిజ్య శాఖ ప్రతినిషులకు అధికారాలు ఇస్తున్నాను అని తెలిపారు.

హాలీవుడ్ మరియు ఇతర దేశాల సినిమాలపై ప్రభావం

అయితే ట్రంప్ చెప్పిన దాంట్లో క్లారిటీ ఇవ్వలేదు. హాలీవుడ్ లో స్టూడియోలు దెబ్బ తింటున్నాయి. కాబట్టి విదేశాల్లో నిర్మించి అమెరికాలో రిలీజ్ చేసే సినిమాలకు ట్యాక్స్ వేస్తాము అన్నారు. అంటే అమెరికా బయట నిర్మించే హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని పలువురు అంటున్నారు. అమెరికాలోనే షూటింగ్స్ చేయాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే విదేశీ సినిమాలు అన్నిటికి ఇదే వర్తిస్తుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంటే వేరే దేశాల సినిమాలు అమెరికాలో రిలీజ్ అయితే 100 శాతం ట్యాక్స్ వేస్తారు అని కొంతమంది అమెరికా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే అమెరికాలో సినిమా టికెట్ రేట్లు పెరుగుతాయి.

టాలీవుడ్ పై ప్రభావం మరియు భవిష్యత్తు

అసలే మన టాలీవుడ్, ఇండియన్ సినిమాలకు భారత్ వెలుపల అమెరికా అతిపెద్ద మార్కెట్. అక్కడ మన ప్రతి సినిమా కనీసం 1 మిలియన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల రూపాయలు పైగా కలెక్ట్ చేస్తుంది. పెద్ద సినిమాలు అయితే 50 కోట్ల కలెక్షన్స్ వరకు అమెరికా నుంచే రప్పిస్తాయి. మరి ట్రంప్ చెప్పింది విదేశాల్లో నిర్మించే హాలీవుడ్ సినిమాలకా లేక అన్ని దేశాల సినిమాలకా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

The Movie Industry in America is DYING a very fast death. Other Countries are offering all sorts of incentives to draw our filmmakers and studios away from the United States. Hollywood, and many other areas within the U.S.A., are being devastated. This is a concerted effort by…

ట్రంప్ యొక్క సినిమా ట్యాక్స్ నిర్ణయం అమెరికా సినిమా పరిశ్రమను మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. టాలీవుడ్ కూడా ఈ ప్రభావానికి మినహాయింపు కాదు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.