|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thaman S: బాలయ్యను చూస్తే ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది : తమన్

Published: 30-08-2025, 9:46 PM
Thaman S: బాలయ్యను చూస్తే ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది : తమన్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖండ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Key Points

1

అఖండ 2 సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

2

బాలయ్య 50 ఏళ్ల సినీ జర్నీని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది.

4

అఖండ 2 రిలీజ్ తేదీని మేకర్స్ వాయిదా వేశారు.

అఖండ 2 రిలీజ్ వాయిదా

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ‌ చిత్రం అఖండ సూపర్ ‌ హిట్ ‌ గా నిలిచింది . ఈ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు . ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ‌ గా అఖండ -2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా బాలయ్య ఫ్యాన్స్ ‌ ను విపరీతంగా ఆకట్టుకుంది . ఈ టీజర్‌లో బాలయ్య మాస్‌ యాక్షన్ సీన్స్‌కు ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు . అయితే ఈ దసరాకు రిలీజ్ ‌ కావాల్సిన అఖండను మేకర్స్ వాయిదా వేశారు . కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు .

బాలయ్యకు వరల్డ్ రికార్డ్స్ గౌరవం

తమన్ ప్రశంసలు

అయితే బాలకృష్ణ సినీ ప్రస్తానం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ ఆయనను సత్కరించింది . ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ ‌ లో నిర్వహించారు . ఈ సందర్భంగా ఈవెంట్ ‌ కు హాజరైన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ‌ బాలయ్యపై ప్రశంసలు కురిపించారు . ఆయనను చూస్తే మాటలు రావని .. ఏదో ఒకటి తీసి కొట్టాలని అనిపిస్తుందని అన్నారు . మ్యూజికల్ ‌ నా చేతుల్లో కొత్తగా కత్తులు , కర్తలు వచ్చేస్తాయి .. ఈ విషయం నాకు కూడా అర్థం కాదన్నారు . అలా ఎందుకు జరుగుతుందో డాక్టర్స్ ‌ నా డీఎన్ ‌ ఏ టెస్ట్ ‌ చేయాలని ఆసక్తికర కామెంట్స్ చేశారు . త్వరలో అఖండ 2 రికార్డులు కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అఖండ -2 సినిమాకు తమన్ సంగీతమందిస్తున్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణ 50 ఏళ్ల సినీ జర్నీ, అఖండ 2 రిలీజ్, మరియు తమన్ అభిప్రాయాలు ఈ కథనంలో చర్చించబడ్డాయి. అఖండ 2 త్వరలోనే రిలీజ్ అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.